Gold: 8 కేజీల బంగారాన్ని అక్కడ దాచి తెచ్చారు.. కట్ చేస్తే సీన్ రివర్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

|

Jan 18, 2023 | 11:06 AM

అంతా మనకు అనుకూలమే అనుకున్నారు.. ప్లాన్ ప్రకారం అనుకున్న పని అమలు చేశారు. ఆరంభంలో ఎలాంటి ఆటంకం కలుగలేదు. కానీ, గమ్యం చేరే సమయంలో బిగ్ ట్విస్ట్ ఎదరైంది.

Gold: 8 కేజీల బంగారాన్ని అక్కడ దాచి తెచ్చారు.. కట్ చేస్తే సీన్ రివర్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Gold Paste
Follow us on

అంతా మనకు అనుకూలమే అనుకున్నారు.. ప్లాన్ ప్రకారం అనుకున్న పని అమలు చేశారు. ఆరంభంలో ఎలాంటి ఆటంకం కలుగలేదు. కానీ, గమ్యం చేరే సమయంలో బిగ్ ట్విస్ట్ ఎదరైంది. అదే వారికి గట్టి షాక్ ఇచ్చింది. అవును, దుబాయ్ నుంచి 8 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు ప్రయాణికులు ముంబైలో పట్టుబడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులు బంగారం స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ అయ్యారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దుబాయ్ నుంచి ముంబైకి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద దాదాపు 8 కిలోల బంగారం పేస్ట్ లభ్యమైంది. పేస్ట్ రూపంలోని ఈ బంగారాన్ని అండర్‌వేర్‌లో దాచుకుని తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ అక్షరాల రూ. 4.54 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, బంగారం అక్రమ రవాణాపై విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..