Spurious Liquor: మధ్యప్రదేశ్‌ కల్తీ మద్యం ఘటనలో మరో ఏడుగురు మృతి.. 21కి చేరిన మృతుల సంఖ్య

Spurious Liquor:మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం కాటేసింది. మురైన్‌ జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మృతి చెందిన...

Spurious Liquor: మధ్యప్రదేశ్‌  కల్తీ మద్యం ఘటనలో మరో ఏడుగురు మృతి.. 21కి చేరిన మృతుల సంఖ్య
Follow us

|

Updated on: Jan 13, 2021 | 9:40 PM

Spurious Liquor: మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం కాటేసింది. మురైన్‌ జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మరో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. 20 మంది వరకు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మురైన్ జిల్లా కలెక్టర్‌, ఎస్సీ తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేయగా, నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, కల్తీ మద్యం తాగి ముందుగా 11 మంది మృతి చెందగా, మరి కొందరు ఆస్పత్రి పాలయ్యారు. మృతి చెందిన వారు జిల్లాలోని వీరిలో మాన్‌పూర్‌, పహవలి గ్రామాలకు చెందిన వారున్నట్లు గుర్తించారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం కారణంగా 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

Also Read: Spurious Liquor: విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి.. 8 మందికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..