Operation Mahadev: పహల్గామ్‌ ఉగ్రవాదులను పట్టించిన చైనా ఫోన్‌… T-82 శాటిలైట్‌ ఫోన్ సిగ్నల్స్‌తో వేట

చైనా ఫోన్‌తోనే పాక్ గొర్రెలు చచ్చాయి. ఏశాటిలైట్ ఫోన్‌సహాయంతో ఇన్నాళ్లూ మన బలగాలకు దొరక్కుండా దాక్కున్నారో..ఆచైనా ఫోన్‌ సిగ్నల్‌తోనే చిక్కారు. చివరకు చచ్చారు. పెహల్గామ్ దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులను వలవేసి, మరీ మనబలగాలు మన్నులో కలిపేసాయి. ఆపరేషన్ మహాదేవ్‌ హండ్రెడ్‌ పర్సెంట్ సక్సెస్‌రేట్‌తో...

Operation Mahadev: పహల్గామ్‌ ఉగ్రవాదులను పట్టించిన చైనా ఫోన్‌... T-82 శాటిలైట్‌ ఫోన్ సిగ్నల్స్‌తో వేట
Pahalgam Terrorists Chinies

Updated on: Jul 30, 2025 | 7:04 AM

చైనా ఫోన్‌తోనే పాక్ గొర్రెలు చచ్చాయి. ఏశాటిలైట్ ఫోన్‌సహాయంతో ఇన్నాళ్లూ మన బలగాలకు దొరక్కుండా దాక్కున్నారో..ఆచైనా ఫోన్‌ సిగ్నల్‌తోనే చిక్కారు. చివరకు చచ్చారు. పెహల్గామ్ దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులను వలవేసి, మరీ మనబలగాలు మన్నులో కలిపేసాయి. ఆపరేషన్ మహాదేవ్‌ హండ్రెడ్‌ పర్సెంట్ సక్సెస్‌రేట్‌తో ముగించాయి మన రక్షణ దళాలు. ఆపరేషన్ మహాదేవ్, భారత్ సీక్రెట్ ఆర్మీ ఆపరేషన్‌లో ఇదో స్పెషల్. ఎందుకంటే గతంలో జరిగిన ఆపరేషన్స్ మన ఆర్మీ బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి హతమార్చేవి. కానీ ఆపరేషన్ మహాదేవ్‌లో మన శత్రువులజాడ శత్రు దేశం నుంచే వచ్చేలా మనబలగాలు వలపన్నాయ్. పెహల్గామ్ దాడులకు బాధ్యులైన నలుగురు ఉగ్రవాదులనూ చైనా సరుకే పట్టించింది..

ఏప్రిల్ 22 పెహల్గామ్ దాడులనుప్రపంచమంతా ఖండించింది. మతమేంటో అడిగి మరీ మారణహోమం సృష్టించారు. మొత్తం 26మందిని పొట్టనపెట్టుకున్న ఆ నలుగురు ఉగ్రవాదుల కోసం భారత బలగాలు ముమ్మరంగా వేటాడాయి. కానీ వారి జాడ లేదు. అయితే హఠాత్తుగా ఓ సిగ్నల్ ఇచ్చిన సమాచారంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. చైనాకు చెందిన నిషేధిత T-82అల్ట్రాసెట్ శాటిలైట్‌ పోన్‌ అర్థరాత్రి ఉగ్రమూకలు ఆన్ చేయడంతో వారి ఆచూకీ దొరికింది. మనదేశంలోకి అక్రమంగా తీసుకొచ్చిన హువాయ్ శాటిలైట్ ఫోన్ గత వారం చివర్లో అనుకోకుండా యాక్టివేట్ అయింది. ఈ సిగ్నల్‌ ఢిల్లీలోని యూనిట్లు గుర్తించాయి. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి.

సోమవారం రాత్రి 2 గంటలకు సీక్రెట్ కమ్యూనికేషన్‌ను ఆన్ చేసారు ఉగ్రవాదులు . డచిగం అడవుల నుంచి అనుమానిత సిగ్నల్స్ రావడంతో ఉదయం 8 గంటలకు డ్రోన్‌లతో డచిగం అడవులను బలగాలు జల్లెడ పట్టాయి. ఉదయం 9:30గంటల ప్రాంతంలో హిల్ ప్రాంతాన్నిమన దళాలు చుట్టుముట్టాయి. 11గంటల 15నిమిషాలకు మన బలగాలను చూసి పారిపోయేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా..ఒకడ్ని హతమార్చారు. మరికాసేపటికే మరో ముగ్గుర్ని మట్టుబెట్టాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు ఆపరేషన్ పూర్తయింది . కేవలం 90నిమిషాల్లో ఉగ్రవాదుల అంతు చూశాయి మన బలగాలు. చనిపోయినవారిలో హషీమ్ మూసా ఉన్నాడు. మూసా పహల్గాం దాడిలో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు.

టెర్రరిస్టులను పట్టించిన T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్‌లు మనదేశం దశాబ్దమున్నర కిందటే నిషేధించింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనీస్ టెలికాం సంస్థలైన హువాయ్, ZTE ఉత్పత్తులపై నిషేధం విధించింది. భారత వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్, 1933 సెక్షన్ 6, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 20 ప్రకారం అమలులోకి వచ్చింది. ఎందుకంటే ఈ ఫోన్‌లు చైనాకు చెందిన టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్‌వర్క్‌తో రహస్య కమ్యూనికేషన్‌కోసం అనుసంధానం చేయబడ్డాయి. T-82 ఫోన్‌లు సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల లాగా కనిపిస్తాయి. అంతర్గత శాటిలైట్ యాంటెన్నాలు వీటిని గుర్తించలేవు . బైసరన్ లోయలో మూడు శాటిలైట్ ఫోన్ సిగ్నల్‌లు గుర్తించబడ్డాయి.పెహల్గామ్ దాడికి ముందు రెక్కీ కోసం చైనా శాటిలైట్‌ ఫోన్‌లనే ఉగ్రవాదులు యూజ్ చేశారు.