అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో మోహన్ భాగవత్ చారిత్రక ప్రసంగం

నాగ్‌పూర్‌లో అక్టోబర్ 20న నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవాల్లో సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ కీలక ప్రసంగం చేశారు. భారతీయ స్వబోధ్‌, జాతీయ ఐక్యత, భిన్నత్వాన్ని గౌరవించడం, సామాజిక సమరసత వంటి అంశాలపై ఆయన సందేశమిచ్చారు. 1925లో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ శతాబ్ది సంవత్సర ముగింపు వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో మోహన్ భాగవత్ చారిత్రక ప్రసంగం
Mohan Bhagwat’s Vijayadashami Speech

Updated on: Oct 20, 2026 | 10:48 AM

నాగపూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కేంద్రమైన నాగపూర్‌లో నిర్వహించిన వార్షిక విజయదశమి ఉత్సవాలు, శతాబ్ది ముగింపు సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి.. ఈ వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంసేవకులను, దేశ ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తూ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన ప్రయాణంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సమాజాన్ని సమైక్యం చేయడంలో, దేశ భద్రత, సంస్కృతి పరిరక్షణలో సంఘ్ పాత్రను ఆయన గుర్తుచేశారు.

సంఘ్ శతాబ్ది ప్రస్థానం – చారిత్రక మైలురాయి:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన ప్రయాణంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దేశ సమాజ నిర్మాణంలో, సంస్కృతి పరిరక్షణలో, విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడంలో సంఘ్ నిర్వహించిన పాత్రను మోహన్ భాగవత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వందేళ్ల ప్రయాణంలో కోట్లాది మంది స్వయంసేవకులు చూపిన అంకితభావం, త్యాగనిరతి దేశాన్ని నిలబెట్టాయని కొనియాడారు.

భారతీయ ‘స్వ’ (Self-Identity) బోధ్ – అస్తిత్వం:

భారతదేశం కేవలం భౌగోళిక ప్రాంతం కాదని, అది ఒక జీవన తత్వమని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు తమ ప్రాచీన సంస్కృతి, మూలాలు, జాతీయ అస్తిత్వాన్ని (Self-Identity) ఎప్పుడూ విస్మరించకూడదని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశపు బలమని, అనేక మతాలు, భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరినీ కలిపే బలమైన సాంస్కృతిక బంధం జాతీయత అని ఆయన ఉద్ఘాటించారు.

వీడియో చూడండి..

మహనీయుల స్మరణ – సామాజిక సమరసత:

ఈ శతాబ్ది వేడుకల సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను, సంఘ సంస్కర్తలను మోహన్ భాగవత్ స్మరించుకున్నారు. ముఖ్యంగా, సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపి, సామాజిక సమరసతను సాధించడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, నైతిక విలువలతో కూడిన మార్గంలో నడవడం ద్వారానే బలమైన భారత్ ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు.

స్వదేశీ భావన – స్వావలంబన:

ఆర్థికంగా, సామాజికంగా దేశం పూర్తిగా స్వయంసమృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ ‘స్వదేశీ’ విధానాన్ని అలవర్చుకోవాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, స్వయం ఉపాధి రంగాలను ప్రోత్సహించడం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సనాతన ధర్మం, జాతీయతా భావం, దేశ ఐక్యత, రక్షణ విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us