రూ. 90 వేలు తీసుకునిపెళ్లికి ఓకే చెప్పి చివర్లో నో చెప్పిన యువతి.. అసలు కథలో ట్విస్ట్ ఇదే!

పెళ్లి సంబంధం కుదిరిందని ఎంతో సంతోషంగా రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి పేరుతో రూ.90 వేలు చెల్లించినప్పటికీ, వివాహం జరగాల్సిన సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెళ్లికొడుకు కుటుంబంపై దాడి జరగడం, యువతి కనిపించకుండా పోవడం, చివరకు పోలీస్ స్టేషన్‌లో పెళ్లికి నిరాకరించడం.. ఇలా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

రూ. 90 వేలు తీసుకునిపెళ్లికి ఓకే చెప్పి చివర్లో నో చెప్పిన యువతి.. అసలు కథలో ట్విస్ట్ ఇదే!
Marriage

Updated on: Nov 28, 2026 | 5:36 PM

పెళ్లి సంబంధం కుదిరిందని ఎంతో సంతోషంగా రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి పేరుతో రూ.90 వేలు చెల్లించినప్పటికీ, వివాహం జరగాల్సిన సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెళ్లికొడుకు కుటుంబంపై దాడి జరగడం, యువతి కనిపించకుండా పోవడం, చివరకు పోలీస్ స్టేషన్‌లో పెళ్లికి నిరాకరించడం.. ఇలా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

రాజస్థాన్ నుంచి పెళ్లి కోసం రాక..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఓ యువకుడికి, కుషినగర్ జిల్లా హటా ప్రాంతానికి చెందిన యువతితో వివాహం కుదిర్చేందుకు ఓ మహిళ మధ్యవర్తిత్వం వహించింది. ఈ సంబంధం కోసం పెళ్లికొడుకు కుటుంబం సదరు మధ్యవర్తికి రూ.90 వేల నగదు ఇచ్చినట్లు ఆరోపించింది. గోరఖ్‌పూర్‌లోని బుధియా మాయి ఆలయంలో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

కోర్టు మ్యారేజ్ దగ్గర మొదలైన వివాదం..!

వివాహ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కోర్టు మ్యారేజ్ అంశం తెరపైకి వచ్చింది. శుక్రవారం (నవంబర్ 27) మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యువతిని కోర్టు వివాహం కోసం తీసుకెళ్తుండగా, ఒక వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు మార్గమధ్యంలో అడ్డగించారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం తమపై దాడి చేసి, యువతిని మరో వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతి.. పెళ్లికి నో!

ఈ పరిణామాలపై వరుడి కుటుంబం ఎయిమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే రాత్రి ఆలస్యంగా స్టేషన్‌కు వచ్చిన యువతి, తాను ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేసింది. అతడి ముఖం తనకు నచ్చలేదని కారణం చెప్పినట్లు సమాచారం.

రూ.90 వేల వ్యవహారంపై పోలీసుల ఆరా..

ఈ కేసులో పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి పాత్రపైనా పోలీసులు విచారణ చేపట్టారు. రూ.90 వేల లావాదేవీ వెనుక అసలు విషయం ఏమిటి? వరుడి కుటుంబంపై దాడి ఎవరు చేశారు? యువతిని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కంటోన్మెంట్ సీఓ అరుణ్ కుమార్ ఎస్. తెలిపిన వివరాల ప్రకారం, పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో ఉన్న యువతీ యువకులు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించి విచారిస్తున్నారు. అన్ని పక్షాల వాంగ్మూలాలు సేకరించిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.

మొత్తానికి రూ.90 వేల పెళ్లి సంబంధం వ్యవహారం గోరఖ్‌పూర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us