25 రూపాయలకే డ్రెస్ అంటూ ప్రచారం.. ఎగబడ్డ జనం

కరోనాపై ఓ పక్క ఫ్రంట్‌లైన్ వారియర్లు యుద్ధం చేస్తుంటే.. మరోపక్క కొందరు మాత్రం ఈ వైరస్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

  • Tv9 Telugu
  • Publish Date - 1:47 pm, Sat, 24 October 20
25 రూపాయలకే డ్రెస్ అంటూ ప్రచారం.. ఎగబడ్డ జనం

Police seize shop: కరోనాపై ఓ పక్క ఫ్రంట్‌లైన్ వారియర్లు యుద్ధం చేస్తుంటే.. మరోపక్క కొందరు మాత్రం ఈ వైరస్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మాకేం కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా కొంతమంది నిర్లక్ష్యం వలన పక్కనవారి ప్రాణాలు పోతున్నాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. అయినా అవేవీ చాలామందికి పట్టడం లేదు. కనీస జాగ్రత్తలను కూడా పాటించడం లేదు.

ఇదిలా ఉంటే మరోవైపు కొందరు వ్యాపారస్తులు సైతం కరోనాను పట్టించుకోవడం లేదు. మాకేంలే.. మా బిజినెస్ జరిగితే చాలు అన్న చందానా ఆఫర్లు, డిస్కౌంట్లను పెడుతున్నారు. ఇలా తమిళనాడులోని సేలంలో నూతనంగా నిర్మించిన ఓ బట్టల దుకాణం భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్‌లు అంటూ ప్రచారం చేసింది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వందలాది ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్ చేశారు. ఇక షాప్‌కి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. ఇంతమంది చనిపోతున్నా జనం మారడం లేదని కామెంట్లు పెడుతున్నారు.

Read More:

దర్శనాల పెంపుపై త్వరలోనే నిర్ణయం: టీటీడీ ఈవో

మహేష్‌ భట్‌పై నటి తీవ్ర ఆరోపణలు.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన దర్శకనిర్మాత