దర్శనాల పెంపుపై త్వరలోనే నిర్ణయం: టీటీడీ ఈవో

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించారు.

  • Manju Sandulo
  • Publish Date - 1:19 pm, Sat, 24 October 20

TTD EO Jawahar Reddy: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించారు. ఇక చక్రస్నానం మహోత్సవం తరువాత జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. సాయంత్రం నిర్వహించే అధ్యాత్మిక కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని వెల్లడించారు. స్వామి వారి సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా ఏకాంతంగా జరిగాయని.. ఈ ఉత్సవాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించిన అర్చకులు, జీయర్ స్వాములకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇక రెండు, మూడు రోజుల్లో దర్శనాల పెంపుపై అధికారులతో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More:

మహేష్‌ భట్‌పై నటి తీవ్ర ఆరోపణలు.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన దర్శకనిర్మాత

కీర్తి ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌ రిలీజ్‌.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్‌