Video: 14 ఏళ్లు చెప్పులు వేసుకోని వ్యక్తికి స్వయంగా బూట్లు తొడిగిన ప్రధాని మోదీ! ఎందుకంటే..?

Updated on: Apr 14, 2025 | 7:56 PM

హర్యానాకు చెందిన రాంపాల్ కశ్యప్, ప్రధాని మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు బూట్లు ధరించనని 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక, ఆయనను కలవడానికి వేచి ఉన్నారు. తాజాగా హర్యానా పర్యటనలో, మోడీ స్వయంగా రాంపాల్‌కు ఫోన్ చేసి కలిసి బూట్లు ధరించమని కోరారు.

హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ 14 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు బూట్లు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. నరేంద్ర మోదీ 2014 లో ప్రధానమంత్రి అయ్యారు. రాంపాల్ కశ్యప్ కోరిక నెరవేరినప్పటికీ, ఆయన మోదీని కలవలేకపోయారు. అందుకే, మోదీని కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలని ఇప్పటి వరకు వేచి ఉన్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. సోమవారం(ఏప్రిల్‌ 14) హర్యానాకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలియగానే, ఆయన స్వయంగా రాంపాల్ కశ్యప్ కు ఫోన్ చేసి, ఆయనను కలవమని చెప్పి, ఆయనే స్వయంగా బూట్లు ఇచ్చి, ధరించాలని కోరారు.

ఆ తర్వాత కశ్యప్‌ స్పోర్ట్స్‌ షూ ధరిస్తుంటే.. ప్రధాని మోదీ ఆయనకు సహాయం చేశారు. ప్రధానమంత్రి మోదీ ప్రేమతో రాంపాల్ కశ్యప్ కు బూట్లు బహుమతిగా ఇచ్చారు. తనను కలవడానికి చెప్పులు లేకుండా వచ్చిన అభిమాని రాంపాల్ కశ్యప్ తో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, “మీరు ఇలా ఎందుకు చేశారు? ఎందుకు ఇబ్బంది పెట్టారు?” అని అడిగారు. అయితే మోదీనే స్వయంగా బూట్లు బహుమతిగా ఇవ్వడం, తన కాళ్లకు తొడగడంతో రాంపాల్ భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Apr 14, 2025 07:41 PM