Central Government: యువతకు కేంద్ర ప్రభుత్వం అద్బుత ఛాన్స్.. అవన్నీ ఉచితం.. ఎవరైనా చేరవచ్చు.

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తోంది. వివిధ కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తోంది. శిక్షణ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది.

Central  Government: యువతకు కేంద్ర ప్రభుత్వం అద్బుత ఛాన్స్.. అవన్నీ ఉచితం.. ఎవరైనా చేరవచ్చు.
Students

Updated on: Apr 28, 2026 | 10:19 PM

కేంద్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద యువతకు అనేక కోర్సులో ఉచిత ట్రైనింగ్ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహిస్తోంది. సాంప్రదాయ కోర్సులు మాత్రమే కాకుండా నేటి మార్కెట్‌కు అనుగుణండా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ కల్పిస్తోంది. ఈ పథకం ఉద్దేశం ఏంటి..? ఎలాంటి కోర్సులు ఉన్నాయి? అనే విషయాలు చూద్దాం.

కోర్సులు ఇవే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ లాంటి పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ట్రైనింగ్ కల్పిస్తోంది. పుస్తక నాలెడ్డ్ కాకుండా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. దీని వల్ల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏదైనా కంపెనీలో వెంటనే ఉద్యోగం పొందవచ్చు. ఈ పథకం ద్వారా శిక్షణ పొందినవారికి ప్లేస్‌మెంట్ అవకాశం కూడా కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తారు. కంపెనీలు ప్రతినిధులు నేరుగా వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను తీసుకుంటారు. శిక్షణ పొందినవారికి సర్టిఫికేట్, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. బయట కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు అవుతాయి. అయితే ఈ పథకం ద్వారా ఉచితంగా శిక్షణ పొందవచ్చు. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీ దగ్గర్లోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆశ్రయించి విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందవచ్చు.

Follow Us