విమానంలోకి దూరి పావురం హల్‌చల్

ఎలా వచ్చిందో తెలియదు..ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు..ఓ విమానంలోకి పావురం దూరింది. ప్రయాణికులను కాసేపు కలవరపెట్టింది. పావురం పరుగులకు సిబ్బంది హడలెత్తిపోయారు.

విమానంలోకి దూరి పావురం హల్‌చల్

Updated on: Feb 29, 2020 | 9:38 AM

విమానంలో కబూతర్…
ఎలా వచ్చిందో తెలియదు..ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు..ఓ విమానంలోకి పావురం దూరింది. ప్రయాణికులను కాసేపు కలవరపెట్టింది. పావురం పరుగులకు సిబ్బంది హడలెత్తిపోయారు. అసలే కరోనా వైరస్ భయంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విమానంలోకి వచ్చేసిన పావురం మరింత భయపెట్టింది. అయితే, ఎట్టకేలకు ఎయిర్ పోర్టు సిబ్బంది చాకచక్యంతో కపోతాన్ని బయటకు పంపించివేశారు. దీంతో ప్యాసింజర్ ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఉన్నట్టుండి పావురం హల్ చల్ చేసింది. విమానంలో పావురం అటూ ఇటూ ఎగురుతూ ఉంటే కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో మీరు చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us