Parliament Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం
Parliament Monsoon Session

Parliament Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం

Updated on: Jul 20, 2026 | 11:25 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు వంటి కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి పెరిగింది. ఒకవైపు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి వ్యూహరచన చేయగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగి దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి.. వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి మూడేళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన సహా పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం..

అయితే.. పార్లమెంట్‌ సమావేశాలకు ముందే అధికార, విపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అంతకుముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగాలని కోరుతున్నా.. అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని మోదీ పేర్కొన్నారు.

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళనతో గందరగోళం ఏర్పడింది.

పార్లమెంట్ సమావేశాలు వీడియో చూడండి..

Published on: Jul 20, 2026 11:07 AM
Follow Us