స్మృతి ఇరానీ ఎక్కడ ? అమేథీలో వెలసిన పోస్టర్లు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనబడడం లేదంటూ యూపీలోని అమేథీలో పోస్టర్లు వెలిశాయి. ఆమె తన నియోజకవర్గంలో రెండేళ్లలో.. రెండు రోజుల్లో..కొన్ని గంటలు మాత్రమే ఉన్నారని ఈ పోస్టర్లలో...

  • Updated On - 11:11 am, Tue, 2 June 20 Edited By: Pardhasaradhi Peri
స్మృతి ఇరానీ ఎక్కడ ? అమేథీలో వెలసిన పోస్టర్లు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనబడడం లేదంటూ యూపీలోని అమేథీలో పోస్టర్లు వెలిశాయి. ఆమె తన నియోజకవర్గంలో రెండేళ్లలో.. రెండు రోజుల్లో..కొన్ని గంటలు మాత్రమే ఉన్నారని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. ‘దయచేసి ఆమె ఆచూకీ తెలియజేయాలని’ కూడా కోరారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ చేసిన ట్వీట్ లో ఈ పోస్టర్ల తాలూకు ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే తన ఈ ‘మిస్సింగ్’ పోస్టర్లపై స్పందించిన స్మృతి.. దీటుగానే సమాధానమిచ్చారు. 8 నెలలు, 10 సార్లు.. 14 రోజులు  తన నియోజకవర్గంతో కాంటాక్ట్ లో ఉన్నానన్నారు. ప్రధాన మంత్రి సంక్షేమ పథకాల కింద రైతుల సంక్షేమం కోసం కృషి చేశానని తెలిపారు. ఇప్పటివరకు బస్సుల్లో 22,150 మంది, రైళ్ల ద్వారా 8,322 మంది వలస కార్మికులు అమేథీ జిల్లాకు తిరిగి వచ్చారని,  కావాలంటే వారి పేర్లతో సహా వెల్లడిస్తానని ఆమె ఛాలెంజ్ చేశారు. మీ రాయ్ బరేలీ నియోజకవర్గానికి సంబంధించి సోనియా గాంధీ ఇలా వివరాలు ఇస్తారా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి బయటకు రావాలా అన్నారు. నేనే ఈ ఆంక్షలను అతిక్రమించానని చెప్పడానికి నన్ను ఉదాహరణగా చూపాలనుకున్నారా అని కూడా స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ప్రజలను మీరు రెచ్ఛగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దు.. అమేథి నియోజకవర్గమంటే మీకు ప్రేమ లేదు. కానీ నాకు ఉంది అని ఆమె చెలరేగిపోయారు. ఈ పోస్టర్లకు కారకులైనవారెవరో తనకు తెలుసునని ఆమె పేర్కొన్నారు.