‘ఆప్’తో లింక్ లేదు.. షాహీన్ బాగ్ షూటర్ ఫ్యామిలీ క్లారిటీ

సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్నవారిపై కాల్పులకు దిగిన కపిల్ గుజ్జర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు బుధవారం మీడియా ముందుకు వచ్చి … తమకు ఆప్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తన కుమారుడికి ఈ పార్టీతో లింక్ ఉందంటూ పోలీసులు, బీజేపీ చేస్తున్న వాదనలను కపిల్ తండ్రి గజె సింగ్ తోసిపుచ్చారు. గత శనివారం షాహీన్ బాగ్ వద్దకు చేరుకున్న కపిల్…. ‘జైశ్రీరామ్’ అని నినాదాలు చేస్తూ..తన గన్ […]

'ఆప్'తో లింక్ లేదు.. షాహీన్ బాగ్ షూటర్ ఫ్యామిలీ క్లారిటీ

సీఏఏకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్నవారిపై కాల్పులకు దిగిన కపిల్ గుజ్జర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు బుధవారం మీడియా ముందుకు వచ్చి … తమకు ఆప్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తన కుమారుడికి ఈ పార్టీతో లింక్ ఉందంటూ పోలీసులు, బీజేపీ చేస్తున్న వాదనలను కపిల్ తండ్రి గజె సింగ్ తోసిపుచ్చారు. గత శనివారం షాహీన్ బాగ్ వద్దకు చేరుకున్న కపిల్…. ‘జైశ్రీరామ్’ అని నినాదాలు చేస్తూ..తన గన్ తో కాల్పులు జరిపాడు. అయితే ఆ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.  పోలీసులు అతడిని అరెస్టు  చేసి తీసుకుపోయారు. ఆప్ పార్టీలో తాను సభ్యుడినని కపిల్ అంగీకరించాడని.. అలాగే  ఆ పార్టీ ట్రేడ్ మార్క్ అయిన ‘క్యాప్’ ను ధరించి ఉన్న ఇతని ఫోటో ఇతని సెల్ ఫోన్ లో ఉందని, ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలని పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. సంజయ్ సింగ్, అతిషి వంటి ఆప్ నేతలతో కపిల్ దిగిన ఫోటోలు ఉన్నప్పటికీ ఈ పార్టీతో అతనికి ఎలాంటి లింక్ లేదని అతని తండ్రితో బాటు  సోదరుడు కూడా చెప్పాడు. ‘ మా కుటుంబానికి ఈ పార్టీతో  ఎలాంటి సంబంధం లేదు.. గత  లోక్ సభ  ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా ఆప్ నాయకులు కొందరు మా లొకాలిటీకి  వచ్చారు. అప్పుడు వారి కోర్కె మేరకు వారిచ్చిన క్యాప్ లు ధరించాం.’ అని గజె సింగ్ చెప్పారు. తాను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2012 ఎన్నికల సమయంలో పోటీ చేశానని, అయితే అనారోగ్యం కారణంగా ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యాయని ఆయన అన్నారు. అంతే తప్ప పాలిటిక్స్ తో ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీకి చెందిన ఓ అభ్యర్థి ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు  ఆయనకు పూలమాల వేసి వెల్ కం చెప్పానని, అసలు ఏ పార్టీ అభ్యర్థి వఛ్చినా తాను గౌరవిస్తానని ఆయన వివరించాడు.ఇదిలా ఉండగా.. ఆప్ నేత సంజయ్ సింగ్ ఢిల్లీ పోలీసులను, బీజేపీని తన ట్విట్టర్లో దుయ్యబట్టారు. ఎన్నికలముందు కమలం పార్టీ ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ డర్టీ పాలిటిక్స్ కి ఇదే నిదర్శనమన్నారు.

Published On - 2:23 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu