Snakebite: తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు.. మూఢనమ్మకాలతో కాలయాపన! చివరకు

|

Sep 04, 2024 | 7:54 PM

మూఢ నమ్మకాల కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాముకాటుకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించకుండా భూత వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. కానీ మంత్రాలు ఫలించలేదు సరికదా.. సకాలంలో చికిత్స అందకపోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని భరూచ్ జిల్లాలో గత శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా..

Snakebite: తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు.. మూఢనమ్మకాలతో కాలయాపన! చివరకు
Snakebite
Follow us on

భరూచ్, సెప్టెంబర్‌ 4: మూఢ నమ్మకాల కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాముకాటుకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించకుండా భూత వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. కానీ మంత్రాలు ఫలించలేదు సరికదా.. సకాలంలో చికిత్స అందకపోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన గుజరాత్లోని భరూచ్ జిల్లాలో గత శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అమోద్ తాలూకా డోరా గ్రామంలోని బరోటా రోడ్‌లోని గురుగోవింద్ సింగ్ నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున విషపూరిత పాము ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అనంతరం ఆ ఇంట్లోని తొమ్మిది నెలల బాలుడిని కాటు వేసింది. దీంతో కొద్దిసేపటికే పాముకాటుతో చిన్నారి మృతి చెందింది.వెల్డింగ్ షాప్ నడుపుతున్న చిన్నారి తండ్రి రాత్రి భోజనం చేసి గదిలో నిద్రకు ఉపక్రమించాడు. నేలపై పరుపులు వేసి, అంతా పడుకున్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఓ విషసర్పం గదిలోకి ప్రవేశించింది. అదే సమయంలో చిన్నారి తల్లి పక్కనే పరుపుపై​నిద్రిస్తుంది. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన పాము చిన్నారిని కాటు వేసింది. పాము తిరిగి వెళ్తున్న సమయంలో దాని తోక చిన్నారి తల్లికి తగిలింది. దీంతో ఉలిక్కిపడి లేచి చూసింది. పక్కన విష సర్పం సర్రు సర్రున వెళ్లడం చూసి కెవ్వున కేక వేసింది.

అనంతరం తన పక్కనే ఉన్న బిడ్డ చెవి నుంచి రక్తం కారడం గమనించి.. ఏం జరిగి ఉంటుందో ఊహించింది. అనంతరం పాము గది బయటకు వెళ్లేంత వరకూ వేచి ఉన్న మహిళ.. బిడ్డను తీసుకుని భూత వైద్యుని వద్దకు పరుగు తీసింది. మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇలా కాలయాపన చేయడంతో పరిస్థితి విషమించింది. సరైన సమయంలో చికిత్స అందక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై విజ్ఞానజాత ఛైర్మన్ జయంత్ పాండ్యా మాట్లాడుతూ.. సదరు భూత వైద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాజాగా బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేక బిల్లును గుజరాత్‌ అసెంబ్లీలో ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.