Colour-coded weather: ఎల్లో.. ఆరెంజ్.. రెడ్ అలెర్ట్స్ అంటే ఏంటి.? వాటిని ఎలా కొలుస్తారు.!

|

Sep 05, 2024 | 11:13 AM

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది.

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడుతుంది అంటాం.. ఎక్కడ పడుతుందో కూడా చెప్తాం కానీ ఎంత పడుతుందో చెప్పాలి అంటే ఎలా కొలుస్తారు.?  అలాగే మోస్తరు వర్షం, భారీ వర్షం, అతిభారీ వర్షం, కుంభవృష్టి అంటూ ఉంటారూ. ఇలా ఎలా క్లాసిఫై చేస్తారు.? దానికి బేసిస్ ఏంటి.? ఎంత వాన పడితే మోస్తరు వర్షం అవుతుంది? కుంభవృష్టి అనాలంటే ఎంత వానపడాలి.?

ఇలా కొలుస్తారు..
ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది. వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గేజ్‌లను ఏర్పాటుచేస్తారు. ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకిలేవీ ఉండకుండా చూస్తారూ. దీనిలో నమోదయ్యే రీడింగ్‌తో ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో మిల్లిమీటర్లలో వెల్లడిస్తారు. ఈ వర్షపాత అంచనాలను వ్యవసాయంతో మొదలుపెట్టి మౌలిక వసతుల నిర్మాణం వరకు ప్రధాన రంగాల్లో విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంచనాల కోసం భారత్‌లో 650కి పైగా అబ్జర్వేటరీలను ఉన్నాయి .

సాధారణంగా:
ఒక మోస్తరు వర్షపాతం అంటే – 15.6 మిల్లీ మీటర్ల నుంచి 64.4 మి.మీ. వరకు
భారీ వర్షం అంటే – 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు
అతి భారీ వర్షం అంటే – 115.6 మి.మీ. నుంచి 204.5 మి.మీ. వరకు
కుంభవృష్టి అంటే – 204.5 మీ.మీ కంటే ఎక్కువ

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 05, 2024 08:08 AM