Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది.

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
Nagaland Minister Temjen Imna

Updated on: Aug 13, 2026 | 10:06 PM

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది.

సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్ స్కాన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. స్కానర్ పదేపదే విఫలమైంది. స్కాన్ పూర్తయ్యేలా చేయడానికి అక్కడున్న వారు అతడి కళ్లను చేతులతో బలవంతంగా తెరిచి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ నవ్వులు వినిపించాయి. ఈ వీడియోకు టెంజెన్ “The struggle is real” అనే క్యాప్షన్ పెట్టారు.

అయితే ఈ సరదా వీడియో వెనుక సాంకేతికత రూపకల్పనకు సంబంధించిన కీలక ప్రశ్నలు ఉన్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. KYC, గుర్తింపు ధ్రువీకరణ, డిజిటల్ సేవల్లో బయోమెట్రిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. విభిన్న శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని సాంకేతికతను రూపొందించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన కొందరు వినియోగదారులు ఇలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతులు అందుబాటులో ఉండాలని కోరారు. సహజమైన శారీరక లక్షణాల కారణంగా ఎవరికీ డిజిటల్ సేవలు పొందడంలో ఇబ్బంది కలగకూడదని వ్యాఖ్యానించారు.

ఈశాన్య భారత ప్రజలపై ఉన్న చిన్న కళ్ళువంటి మూసధోరణులను టెంజెన్ గతంలోనూ తనదైన హాస్యంతో ప్రస్తావించారు. 2022లో ఓ కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చిన్న కళ్ల వల్ల దుమ్ము తక్కువగా పడుతుందని, సుదీర్ఘ కార్యక్రమాల్లో సులభంగా నిద్రపోవచ్చని ఆయన చమత్కరించడంతో ప్రేక్షకులు నవ్వారు.

తాజా KYC వీడియో కూడా అదే శైలిలో.. ఒక సరదా సంఘటనను చూపిస్తూ పెద్ద అంశంపై చర్చకు దారితీసింది. వీడియో చూస్తే నవ్వు రావచ్చు.. కానీ భారతదేశంలోని విభిన్న శారీరక లక్షణాలను సాంకేతిక వ్యవస్థలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటున్నాయనే ప్రశ్న మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశంగా మారింది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us