Court Verdict: మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడికి కోర్టు సంచలన తీర్పు..
అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది... ఆ ఊరిలోని

అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది… ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు, ఉతికి, ఐరన్ చేయాలని ఆదేశించింది. ఆరు నెలలపాటు తప్పని సరిగా ఇలా చేయాల్సిందేనని కోర్టు ఖచ్చితమైన తీర్పునిచ్చింది…నిందితుడికి కేసు నుంచి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వినూత్న శిక్ష వేసింది. ఈ ఘటన బీహార్‌లోని మధుబానిలోని ఓ కోర్టు ఇలా ఊహించని తీర్పునిచ్చింది.
బిహార్‌కు చెందిన ఓ యువకుడు..స్థానిక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు కేసు నమోదు చేయగా, మధుబాని కోర్టు కేసు విచారించింది. ఏప్రిల్‌లో నిందితున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా, అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. నిందితుడు 20ఏళ్ల యువకుడే కాబట్టి, క్షమించి వదిలిపెట్టాలని, నిందితుడు సమాజానికి సేవ చేయాలని భావిస్తున్నాడని అతడి తరపు లాయర్ కోర్టు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అతనికి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు సహా ఆ ఊరిలోని మహిళలందరి బట్టలను ఆరు నెలలపాటు ఉచితంగా ఉతికి ఐరన్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతోపాటు.. 10వేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది. మొత్తానికి ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.
Also Read:
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!
ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!