Viral Video: ‘నీకెంత ధైర్యం నన్నే కొడతావా..?’ ప్రభుత్వ బడిలో ప్రిన్సిపల్‌, లైబ్రేరియన్‌ సిగపట్లు.. వీడియో వైరల్

ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్, లైబ్రేరియన్‌ను బూతులు తిట్టడం ప్రారంభించింది. దీంతో లైబ్రేరియన్‌ తన ఫోన్‌లో ప్రిన్సిపల్ తిట్ల పురాణాన్ని రికార్డు చేయడం ప్రారంభించింది. ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ ఆమెపై చేయిచేసుకోవడమేకాకుండా, లైబ్రేరియన్‌ చేతిలోని ఫోన్‌ లాక్కుని నేలకేసి కొట్టింది. ఈ చర్యతో ఊగిపోయిన లైబ్రేరియన్‌..

Viral Video: నీకెంత ధైర్యం నన్నే కొడతావా..? ప్రభుత్వ బడిలో ప్రిన్సిపల్‌, లైబ్రేరియన్‌ సిగపట్లు.. వీడియో వైరల్
Principal And Librarian Fight In School

Updated on: May 07, 2025 | 8:52 PM

ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్, లైబ్రేరియన్‌ ఏదో విషయమై ఇద్దరు వాదులాడుకున్నారు. ఇంతలో ప్రిన్సిపల్ బూతులు తిట్టడం ప్రారంభించింది. దీంతో లైబ్రేరియన్‌ తన ఫోన్‌లో ప్రిన్సిపల్ తిట్ల పురాణాన్ని రికార్డు చేయడం ప్రారంభించింది. ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ ఆమెపై చేయిచేసుకోవడమేకాకుండా, లైబ్రేరియన్‌ చేతిలోని ఫోన్‌ లాక్కుని నేలకేసి కొట్టింది. ఈ చర్యతో ఊగిపోయిన లైబ్రేరియన్‌.. ప్రిన్సిపల్‌పై చేయి చేసుకుంది. అంతే నన్నే కొడతావా.. అంటూ ఇద్దరూ సిగపట్లు పట్టి దుమ్ముదుమ్ముగా కొట్టుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్‌లోని ఏకలవ్య ఆదర్శ్ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకెళ్తే..

వైరల్ అవుతున్న వీడియోలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ బిగ్గరగా వాదించుకోవడం చూడవచ్చు. లైబ్రేరియన్ తన ఫోన్‌లో ప్రిన్సిపల్ తిట్లను రికార్డ్ చేసింది. కోపంతో రగిలిపోయిన ప్రిన్సిపాల్ ఆమెను చెంపదెబ్బ కొట్టి, ఆమె ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగలగొట్టింది. దీంతో.. ‘మేడమ్, మీకు ఎంత ధైర్యం? నన్ను కొట్టడానికి మీకు ఎంత ధైర్యం? నా ఫోన్‌ పగిలిపోయిందని లైబ్రేరియన్ ప్రిన్పిపల్‌ను అడిగింది. ప్రిన్సిపాల్ మళ్లీ ఆమె ఫోన్ తీసుకొని మరోమారు విసిరేసింది. నా ఫోన్ పగలగొట్టావు? నన్ను చెంపదెబ్బ కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? అని లైబ్రేరియన్ అడుగుతుండగా.. ప్రిన్సిపాల్ తన ఫోన్‌లో ఆమె మాటలను రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత లైబ్రేరియన్ ప్రిన్సిపాల్ చేతిపై కొట్టడంతో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

లైబ్రేరియన్, ప్రిన్సిపాల్ ఇద్దరూ.. జుట్టుపట్టి కొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్.. లైబ్రేరియన్ జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది. నన్ను తాకడానికి నీకు ఎంత ధైర్యం? అని లైబ్రేరియన్ అడగ్గా.. అందుకు ప్రిన్సిపాల్ బదులిస్తూ ఆత్మరక్షణ అని చెప్పింది. చివరికి ఇద్దరూ అలిసిపోయి నిలబడ్డా ఒకరి జుట్టును ఒకరు మాత్రం విడిచిపెట్టలేదు. ఆఖరికి స్కూల్‌లో పనిచేసే ఆయా బతిమాలి ఇద్దరినీ విడిపించింది. వీరు గొడవ పడుతున్న వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు మహిళలను అధికారులు విధుల నుంచి తొలగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలను అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య కార్యాలయానికి తరలించారు.

ఇక ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు.. చదువుకున్న ఈ ఇద్దరు మహిళల కంటే ఏమీ చదువుకోని స్కూల్లో పనిచేసే ఆయా సంస్కారవంతురాలని ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టగా.. ప్రిన్సిపాల్ ప్రవర్తన అసహ్యంగా ఉందని, కోపాన్ని ఏ మాత్రం నియంత్రించుకోలేని లేడీ గూండాలా ప్రవర్తిస్తుందని, అస్సలామెకు ప్రిన్సిపాల్ అయ్యే అర్హత లేదని మరో యూజర్‌ తిట్టిపోశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.