ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చెల్లుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

  • Publish Date - 12:24 pm, Fri, 9 October 20 Edited By:
ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

MLA Prabhu marriage: తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చెల్లుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సౌందర్య మేజర్‌ కాబట్టి ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. సౌందర్య అనుమతితోనే వివాహం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకోడానికి అవకాశం లేదన్న హైకోర్టు.. స్వామినాథన్‌ వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కుమార్తె సౌందర్యతో మాట్లాడేందుకు తండ్రి స్వామినాథన్‌కి కోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే తండ్రి మాటలను సౌందర్య పట్టించుకోనట్లు సమాచారం. కాగా గత వారంలో ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దీనిపై సౌందర్య తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. బలవంతంగా తన కుమార్తెలను ఎమ్మెల్యే ప్రభు పెళ్లి చేసుకున్నాడని, ఇంకా తన కుమార్తెకు 19 ఏళ్లు నిండలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ సౌందర్యను పిలిపించి విచారణ జరిపిన కోర్టు తమ తీర్పును ఇచ్చింది.

Read More:

బాకీ వసూలు చేసుకొస్తానంటూ వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం

ప్రభాస్ మూవీలో అమితాబ్‌.. యూనిట్ స్పందన ఇదే