నేపాల్ లో చైనా చొరబాట్లు, స్థానికుల మండిపాటు

నేపాల్ లోని హుమ్లా జిల్లాలో చైనా చొరబాటు పట్ల నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో కైలాస పర్వతానికి సమీపంలో ఆ దేశం అక్రమంగా తొమ్మిది భవనాలను నిర్మించింది. పైగా ఆ దరిదాపులకు..

నేపాల్ లో చైనా చొరబాట్లు, స్థానికుల మండిపాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 23, 2020 | 4:49 PM

నేపాల్ లోని హుమ్లా జిల్లాలో చైనా చొరబాటు పట్ల నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో కైలాస పర్వతానికి సమీపంలో ఆ దేశం అక్రమంగా తొమ్మిది భవనాలను నిర్మించింది. పైగా ఆ దరిదాపులకు స్థానికులను కూడా అనుమతించలేదు. దీంతో బుధవారం నేపాలీలు ఖాట్మండు లో చైనా రాయబార కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. చైనా గో బ్యాక్ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతబట్టుకుని ఆందోళనకు పూనుకొన్నారు. హుమ్లా జిల్లాలోనూ, సమీప ప్రాంతాల్లోనూ చైనా చొరబాట్లు, ఆ దేశ సైనికుల ఉనికి నిజమేనని నేపాల్ అధికారులు కూడా అంగీకరించారు. అయితే ప్రభుత్వం మాత్రం కిమ్మనడం లేదు. డ్రాగన్ కంట్రీ ఆక్రమణలను అడ్డుకోకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్ఛరించారు.

లడాఖ్ సరిహద్దుల్లో ఓ వైపు చొరబడి ..భారత్ కు తలనొప్పులు తెచ్చిపెడుతూ …మరోవైపు  నేపాల్ మీదా  చైనా కన్నేసింది. ఇప్పటికే ఆ దేశంతో ఆనుకుని ఉన్న తమ దేశ సరిహద్దులను దాటి క్రమంగా నేపాల్ భూభాగాలను ఆక్రమిస్తోంది.

Latest Articles