Kishan Reddy: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్.. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు.. ఆయన చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే

Kishan Reddy: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్.. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ..
G Kishan Reddy
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 02, 2024 | 4:39 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు.. రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి జవాబుదారీగా, ప్రజల గొంతుకుగా ఉండే ప్రతిపక్ష నేత.. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు..

నాడు వాజ్‌పేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్ లాంటి దిగ్గజాలు ఈ ప్రతిపక్ష నేత పాత్రను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే.. నేడు అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీ వ్యవహరించారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా రాహుల్ గాంధీ హిందువులపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసి.. ఆయనకు హిందూ సమాజంపై ఉన్న వ్యతిరేకతను మరోసారి తన వ్యాఖ్యల్లో రుజువు చేసుకున్నారన్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ పార్టీపై ఉన్న ద్వేషాన్ని రాహుల్ గాంధీ మరోమారు చూపించారన్నారు.

హిందువులను అవమానించడం ఇండియా కూటమికి ఇదేం కొత్తకాదని.. గతంలోనూ కాంగ్రెస్, ఆ పార్టీలోని కూటమి సభ్యులు పలుసార్లు హిందూ సమాజంతో పాటు సనాతన ధర్మాన్ని సైతం అవమానించారని కిషన్ రెడ్డి చెప్పారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను శిక్షించే విధంగా మత హింస బిల్లును రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కాగా, లోక్‌సభలో హిందువులపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ.. మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.

దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ పైర్..

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్షణ్ సింగ్ సైతం ఈ విషయంపై స్పందించి.. ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో హిందువులపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవని.. కేవలం ప్రజలకు, దేశానికి సంబంధించిన అంశాలను మాత్రమే లేవనెత్తడం సముచితం.. అంటూ ట్విట్టర్ లో తెలిపారు.

ఐటీఆర్ రీఫండ్ జమ కాలేదా..? అసలు విషయం తెలిస్తే షాక్
ఐటీఆర్ రీఫండ్ జమ కాలేదా..? అసలు విషయం తెలిస్తే షాక్
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సాయం రూ. 8000లకు పెరిగే అవకాశం
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సాయం రూ. 8000లకు పెరిగే అవకాశం
వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!
వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలను దొచ
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలను దొచ
అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ
అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ
క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!
క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!
కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..
కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..
తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే