2024 ఫస్టాఫ్‎లో బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఇవే..

TV9 Telugu

04 July 2024

2024లో విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న కల్కి ఇప్పటికే 700 కోట్ల పైగా వసూళ్లు చేసి 1000 కోట్ల వైపుగా దూసుకుపోతుంది.

కల్కి తర్వాత స్థానంలో నిలిచింది హనుమాన్ మూవీ. చిన్న సినిమాగా వచ్చి 350 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.

తర్వాత చెప్పుకోదగ్గ సినిమా టిల్లు స్క్వేర్. బ్లాక్ బస్టర్ టాక్ తో 134 కోట్లు వసూళ్లు చేసింది ఈ సినిమా.

సుహాస్, శివాని నాగారం జంటగా తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది.

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియాదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఓం బీమ్ బుష్ హిట్ అయింది.

కార్తికేయ హీరోగా తెరకెక్కిన భజే వాయు వేగం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్.

ఆనంద దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ జోడిగా నటించిన గం గం గణేశ సినిమా కూడా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిన గుంటూరు కరం ఏవరేజ్ అయినప్పటికీ 200పైగా వసూళ్లు సాధించింది.