China Conspiracy: సరిహద్దులో కవ్వింపు చర్యలు.. అంతర్జాతీయ మీడియాపై పట్టు.. భారత్‌పై ఒత్తిడికి చైనా ద్విముఖ వ్యూహం

అరుణాచల్‌ ప్రదేశ్‌ను దురాక్రమించే యత్నాలు చేస్తూ అంతర్జాతీయంగా భంగపడుతూ వస్తున్న చైనా ఇపుడు గల్వాన్‌లోయలో చైనా జాతీయ జెండాలు ఎగురవేస్తూ భారత్‌ను రెచ్చగొడుతుంది.

China Conspiracy: సరిహద్దులో కవ్వింపు చర్యలు.. అంతర్జాతీయ మీడియాపై పట్టు.. భారత్‌పై ఒత్తిడికి చైనా ద్విముఖ వ్యూహం
India Vs China
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 05, 2022 | 7:55 PM

China conspiracy against India: భారత్‌తో మరోసారి కయ్యానికి కాలు దువ్వుతుంది డ్రాగన్ కంట్రీ. కొద్ది రోజులుగా సరిహద్దు వెంబడి యుద్ధ కాంక్షను చాటుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను దురాక్రమించే యత్నాలు చేస్తూ అంతర్జాతీయంగా భంగపడుతూ వస్తున్న చైనా ఇపుడు గల్వాన్‌లోయలో చైనా జాతీయ జెండాలు ఎగురవేస్తూ భారత్‌ను రెచ్చగొడుతుంది. టిబెట్‌ వెంబడి రోబో మిలిటరీని మోహరిస్తుంది. తాజాగా వివాదాస్పద ప్రదేశంలో ఓ వంతెనను నిర్మించింది కూడా. యుద్ధ సమయంలో సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని, శతఘ్నులను, ఇతర యుద్ద సామాగ్రిని తరలించేందుకు పటిష్ట ప్రణాళికలతో చర్యలు చేపట్టింది చైనా. భారత్‌–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలో తాజాగా ఒక వంతెనను కూడా నిర్మించింది. ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన గుట్టు చప్పుడు కాకుండా నిర్మించింది.. వంతెన చిత్రాలు శాటిలైట్‌ చిత్రాల ద్వారా బయటపడడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని తెలుస్తోంది. ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణం దిక్కు ఉన్న కైలాస్‌ శిఖరాల వద్ద గత ఏడాది భారత సేనలు పట్టు సాధించాయి. దీంతో భవిష్యత్తులో భారత సైన్యానికి దీటుగా స్పందించేందుకుగాను సైన్యం మోహరింపునకు వీలుగా కొత్త వంతెనను చైనా సిద్ధం చేసిందని తెలుస్తోంది. వంతెన మీదుగా భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపాలని చైనా చూస్తోందని ఆర్మీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

తూర్పు లద్దాఖ్‌లో 2020 నుంచే భారత్, చైనా చెరో 50 వేల సైన్యాన్ని మోహరించాయి. 2020 జూన్‌లో గల్వాన్‌ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 2022 కొత్త సంవత్సరం మొదలైన కొద్ది గంటలకే గల్వాన్‌ లోయ తమదేనంటూ చైనా ఆర్మీ తమ జాతీయ జెండాను ఎగురవేసింది. ఒక్క అంగుళం నేల కూడా వదులుకునేది లేదు అనే సందేశాన్ని చైనా సైనికులు తమ పౌరులకు కొత్త సంవత్సర కానుకగా పంపించారని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ట్వీట్‌ చేసింది. దీంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై మండి పడ్డాయి. గల్వాన్‌ లోయకు మన త్రివర్ణ పతాకమే సరిగ్గా సరిపోతుంది. ప్రధాని మౌనదీక్షను వీడి చైనా ఆక్రమణలపై మాట్లాడాలి అని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. సరిహద్దులో యుద్ధ కాంక్షతో తహతహలాడుతున్న చైనా మరోవైపు ప్రపంచ మీడియాపై పట్టు కోసం ప్రయత్నిస్తుంది. చైనాలో ట్విటర్‌ను అధికారంగా బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. గ్లోబల్‌ టైమ్స్‌, జిన్‌హువా వంటి అధికారిక వార్తా సంస్థలు ఎవరి కోసం ట్విటర్‌లో ట్వీట్లు చేస్తున్నాయన్న సందేహం అంతర్జాతీయ అంశాల విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాల మీడియాల్లో ఎటువంటి వార్త రావాలనుకుంటే .. వాటికి సంబంధించిన అంశాలను చైనా వార్తా సంస్థలు ట్వీట్‌ చేస్తాయన్నమాట. ఈ రకంగా ఆయా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను తనకు అనుగుణంగా మార్చుకుంటోంది డ్రాగన్‌ కంట్రీ.

పశ్చిమ దేశాల ఆదిపత్యాన్ని అడ్డుకోవడానికి మీడియాను చైనా ఓ పదునైన ఆయుధంగా ఎంచుకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో ఆయా దేశాల హవా కొనసాగింది. తొలినాళ్లలో చైనా ఈ రంగంపై పెద్దగా వెచ్చించలేదు. చైనీయుల కోసం వార్తలను సెన్సార్‌ చేయడం.. విదేశీ పత్రికల జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడంపైనే దృష్టిపెట్టింది. కానీ, చైనా ఇప్పుడు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పేరుతో ప్రపంచ దేశాల్లో పాగా వేస్తోంది. వార్తల రూపంలో ప్రజాభిప్రాయాన్ని చైనాకు అనుకూలంగా ప్రభావితం చేయడం దానికి చాలా కీలకంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం నుంచి డ్రాగన్‌ కూడా మీడియా ద్వారా ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలను చైనాకు అనుకూలంగా మార్చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. దీనికి కరోనావైరస్‌ మహమ్మారిని కూడా వాడుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం 2020లో ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌’ 50 దేశాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రపంచ మీడియాపై పట్టు సాధించేందుకు 2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు దాదాపు పది బిలియన్‌ డాలర్లను చైనా ఖర్చు చేసింది. చైనా మీడియా కంటెంట్‌ను విదేశీ మీడియా సంస్థలకు పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆయా దేశాల స్థానిక మీడియా సంస్థలతో సహకార ఒప్పందాలు చేసుకొంటోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరిన తొలి జీ-7 దేశంగా ఇటలీ నిలిచింది. దీనిపై సంతకాలు జరిగే సమయంలో షీ జిన్‌పింగ్‌ వరుస పెట్టి మీడియా ఒప్పందాలు చేసుకొన్నారు.

బీఆర్‌ఐ ప్రాజెక్టుకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి.. ఎటువంటి విమర్శలు తలెత్తకుండా మీడియాను వాడుకొంటోంది. సెర్బియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోని కీలక మీడియా సంస్థలపై చైనా ప్రభావం చాలా ఉంది. ఫలితంగా చైనా వ్యతిరేక వార్తలు తగ్గాయి. చాలా ఆఫ్రికా దేశాల్లో మీడియా దయనీయంగా ఉండటం చైనాకు కలిసి వస్తోంది. చైనాకు ముడిసరుకుల సరఫరా, బీఆర్‌ఐ ప్రాజెక్టులో ఈ ఖండం చాలా కీలకం. కెన్యాలోని స్టార్‌ టైమ్స్‌ పేరిట చైనా కంపెనీ అత్యంత చౌకగా శాటిలైట్‌ టీవీ ప్యాకేజీలు అందిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో తప్పుడు ప్రచారానికి మీడియాను విపరీతంగా వాడుకొంది. వుహాన్‌లో నిర్వహించిన మిలటరీ గేమ్స్‌లో అమెరికన్ల ద్వారా వైరస్‌ వ్యాపించిందని ఆరోపణలు చేసి.. దానికి బలమైన ప్రచారం కల్పించింది. అంతేకాదు.. ఇటలీలో కరోనా వైరస్‌ పుట్టిందని గ్లోబల్‌ టైమ్స్‌ కథనాలు వండి వార్చింది. కొందరి నిపుణుల పేరుతో సోషల్‌ మీడియా ఖాతాలు తెరిచి.. చైనాకు అనుకూల వాదనలు తెరపైకి తెస్తుంది డ్రాగన్‌ కంట్రీ. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌ సైన్యంపై పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ ‘మైక్రోవేవ్‌’ ఆయుధంతో దాడి చేసినట్లు 2020 నవంబర్‌లో ‘ది టైమ్స్‌’ ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో భారత్‌లో గగ్గోలు మొదలైంది. కానీ, ఈ వార్తలు శుద్ధ అబద్ధమని భారత సైన్యం ట్విటర్‌లో వివరణ ఇచ్చింది. అయితే చైనాలో విదేశీ మీడియా ప్రతినిధులపై సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. ఒక్క 2020లోనే 18 మంది విదేశీ మీడియా ప్రతినిధులను బహిష్కరించింది. ఇక్కడ ఉన్న వారు కూడా చాలా వరకు చైనా ఇచ్చే సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది.

ఓవైపు భారత్ సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మీడియాపై పట్టు సాధించేందుకు భారీ పెట్టుబడులు.. ఇలా డ్రాగన్ కంట్రీ మనదేశానికి సవాళ్ళు విసురుతూనే వుంది. భారత సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకునే కుటిలయత్నాలు ఇందుకు అదనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ అంతర్జాతీయ వ్యూహాలను పునర్లిఖించుకోవాల్సిన అవసరం వుందని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన వ్యూహరచన చేయాలని సూచిస్తున్నారు. ఈ దిశగా చైనా బలం, బలహీనతలను విశ్లేషించుకోవాలని, ఆ దేశంతో మనకున్న ఒప్పందాలను పున:సమీక్షించుకోవాలని సలహాలిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు