India-Canada: అప్పటికల్లా భారత్ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్య సిబ్బందిపై బహిష్కరణ.. మోదీ సర్కార్ కీలక ఆదేశాలు

భారత్-కెనడా మధ్య దౌత్యయుద్ధ మరింత ముదిరింది. ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజీవ్‌కుమార్‌ వర్మతో పాటు ఇతర దౌత్య సిబ్బంది ప్రమేయముందని కెనడా ప్రధాని ట్రుడో ఆరోపించడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది.

India-Canada: అప్పటికల్లా భారత్ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్య సిబ్బందిపై బహిష్కరణ.. మోదీ సర్కార్ కీలక ఆదేశాలు
India Canada
Follow us

|

Updated on: Oct 14, 2024 | 11:25 PM

భారత్-కెనడా మధ్య దౌత్యయుద్ధ మరింత ముదిరింది. ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజీవ్‌కుమార్‌ వర్మతో పాటు ఇతర దౌత్య సిబ్బంది ప్రమేయముందని కెనడా ప్రధాని ట్రుడో ఆరోపించడంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు రక్షణ లేదని , అందుకే హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తునట్టు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ట్రుడో స్టేట్‌మెంట్‌పై భారత్‌లో కెనడా రాయబారిని పిలిపించి విదేశాంగ శాఖ వివరణ అడిగింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యసిబ్బందిని బహిష్కరించింది. ఈనెల 19వ తేదీ లోగా దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించింది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని.. మత ఛాందసవాదులకు ఆయన లొంగిపోతున్నారని భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రం మండిపడింది. అందుకే.. హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బందిని .. వెనక్కి రప్పిస్తునట్టు కేంద్రం ప్రకటనలో తెలిపింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో విచారణ జరుపుతున్న కెనడా ప్రభుత్వం.. భారత హైకమిషనర్‌ సంజయ్ కుమార్ వర్మతోపాటు పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. ఈ విషయం కెనడా నుంచి అక్కడ ఉన్న భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చర్యలు సరికావని పేర్కొన్న భారత్.. ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో నడిచే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. మత ఛాందసవాదులకు మద్దతుగా ఉందని మండిపడింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి గతేడాది.. కెనడా పార్లమెంటులో మాట్లాడిన జస్టిన్ ట్రూడో.. ఈ హత్య వెనుక భారత అధికారుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. వాటికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఆ దేశ ప్రభుత్వాన్ని అడిగినా.. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు భారత్‌కు ఇవ్వలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసమే, మత ఛాందసవాదులకు మద్దతు పలికేందుకే.. ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై విమర్శలు చేస్తోందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఖలిస్తాన్‌ నేత హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత..

జూన్‌ 18, 2023లో బ్రిటీష్‌ కొలంబియా లోని గురుద్వారా ముందు ఖలిస్తాన్‌ నేత హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భారత్‌ ఏజెంట్లే ఈ హత్య చేశారని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను భారత్‌ పదేపదే తీవ్రంగా ఖండిస్తోంది. కొద్ది రోజుల క్రితమే లావోస్‌లో ఆసియాన్‌ సదస్సులో జస్టిన్‌ ట్రూడో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగలేదు. తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది. కెనడా నుంచి భారత దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

జస్టిన్‌ ట్రుడో చాలాకాలం నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. గత ఏడాది కూడా కేంద్రం కెనడా పౌరులకు భారత వీసాలను తగ్గించింది. కెనడా కూడా భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..