‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు 135 కిలోల బరువున్న తాను ఇప్పుడు 89 కిలోలకు చేరుకున్నానని.. ఏకంగా 46 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే ఇది ఎలాంటి తక్షణ పరిష్కారం లేదా కఠినమైన డైట్ వల్ల సాధ్యపడలేదని.. తన జీవనశైలిలో క్రమశిక్షణ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రధాన కారణాలని చెప్పారు.

‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!
Union Minister Nitin Gadkari

Updated on: Aug 12, 2026 | 5:51 PM

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు 135 కిలోల బరువున్న తాను ఇప్పుడు 89 కిలోలకు చేరుకున్నానని.. ఏకంగా 46 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే ఇది ఎలాంటి తక్షణ పరిష్కారం లేదా కఠినమైన డైట్ వల్ల సాధ్యపడలేదని.. తన జీవనశైలిలో క్రమశిక్షణ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రధాన కారణాలని చెప్పారు.

ఇటీవల దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్‌లో గడ్కరీని కలిసిన సందర్భంగా ఆయన తన రోజువారీ దినచర్య గురించి వివరించారు. తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. రాత్రి ఆలస్యంగా అపాయింట్‌మెంట్లు ఉన్నప్పటికీ ఉదయం 7 గంటలకు నిద్రలేచి సుమారు రెండున్నర గంటల పాటు వ్యాయామం చేస్తానని వెల్లడించారు.

కరోనా తర్వాత మారిన ఆలోచన

కరోనా సమయంలో తన సన్నిహిత మిత్రులను కొందరిని కోల్పోయిన తర్వాత ఆరోగ్యం విలువ తనకు మరింత స్పష్టంగా అర్థమైందని గడ్కరీ చెప్పారు. అంతకుముందు తన జీవితం ప్రణాళిక లేకుండా, క్రమశిక్షణ లేకుండా సాగేదని అంగీకరించారు. అయితే కోవిడ్ అనంతరం తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వ్యాయామాన్ని తన జీవితంలో తప్పనిసరి భాగంగా మార్చుకున్నారు. రోజూ రెండు నుంచి రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయడంతో పాటు ప్రాణాయామం, స్ట్రెచింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ట్రైనర్ మార్గదర్శకత్వంలో ఈ వ్యాయామాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

నితిన్ గడ్కరీ తన బరువు తగ్గడాన్ని కేవలం రూపంలో వచ్చిన మార్పుగా చూడటం లేదు. ఆరోగ్యమే జీవితంలో అత్యంత ముఖ్యమైన సంపద అని ఆయన చెబుతున్నారు. వృత్తిపరమైన విజయాలు, హోదా, సంపద ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వాటిని ఆస్వాదించలేమని ఆయన అభిప్రాయం. తన అనుభవం ద్వారా ఇతరులు కూడా ఆరోగ్యాన్ని వాయిదా వేయకుండా రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని గడ్కరీ సూచిస్తున్నారు.

అయితే సాధారణ వ్యక్తులు కూడా ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయాల్సిందేనని కాదు. నిపుణుల ప్రకారం ప్రతి ఒక్కరి వయసు, ఆరోగ్య పరిస్థితి, శారీరక సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా భారీ స్థాయిలో బరువు తగ్గాలనుకునేవారు వైద్యులు లేదా అర్హత కలిగిన నిపుణుల సలహాతో ముందుకు సాగడం మంచిది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us