Banks Waive Off Loans: 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ప్రకటన చేసిన కేంద్రం..

|

Dec 20, 2022 | 7:10 AM

NPA Write off: గత ఐదేళ్లలో ప్రభుత్వం రంగ బ్యాంకులు మొత్తం రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. తద్వారా బ్యాంకులు మొండి బకాయిలను..

Banks Waive Off Loans: 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ప్రకటన చేసిన కేంద్రం..
బ్యాంకు రుణాలు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు అమాంతం పెరిగాయి. అటు రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించడంతో.. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
Follow us on

గత ఐదేళ్లలో ప్రభుత్వం రంగ బ్యాంకులు మొత్తం రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. తద్వారా బ్యాంకులు మొండి బకాయిలను వదిలించుకున్నాయని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో గత ఐదేళ్ల గణాంకాలను వివరిస్తూ.. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లుగా బ్యాంకుల్లో చిక్కుకున్న రుణాలను రైటాఫ్ ఖాతాకు బదిలీ చేసినట్లు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో బ్యాంకులు 10 లక్షల కోట్లకు పైగా రుణమాఫీ చేశాయి.

ఇక అధికారిక సమాచారం ప్రకారం.. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ బ్యాంకులు మాఫీ చేసిన రుణాలలో రూ. 103 లక్షల కోట్లను రికవరీ చేసింది. అలాగే, గత 5 సంవత్సరాలలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు 10.09 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి.

ఈ బ్యాంకుల కోట్లాది రూపాయలు నష్టపోయాయి..

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ గరిష్టంగా రూ.19,666 కోట్ల రుణాలను మాఫీ చేసింది.

ఇవి కూడా చదవండి

గత ఆర్థిక సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ గరిష్టంగా రూ.19,484 కోట్ల రుణాలను మాఫీ చేసింది.

గత ఆర్థిక సంవత్సరంలో PNB గరిష్టంగా రూ.18,312 కోట్ల రుణాలను రద్దు చేసింది.

గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా గరిష్టంగా రూ.17,967 కోట్ల రుణాలను మాఫీ చేసింది.

రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సిందే..

మాఫీ చేసినంత మాత్రాన రుణం తీసుకున్న వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. బ్యాంకు ఈ మొత్తం రుణాలను రుణ గ్రహీత నుంచి రికవరీ చేస్తుందని స్పష్టం చేశారు. రుణ గ్రహీత తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి బాధ్యత వహిస్తారని, ఈ సొమ్మును రికవరీ చేసేందుకు బ్యాంకులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు. ఇందుకోసం బ్యాంకులు కోర్టును కూడా ఆశ్రయించవచ్చన్నారు. బ్యాంకులు దివాలా చట్టం కింద రుణ గ్రహీతపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కేంద్రం మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..