
దేశ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య కీలక అంశాలపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. ఓ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. జెన్ జీకి చెందిన ఓ టీమ్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో గత కొన్ని మాసాల వ్యవధిలో పలు ఈవెంట్లలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఫ్యాక్ట్ చెక్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కీలక అంశాలపై వివిధ సందర్భాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ వివిద సందర్భాల్లో చేసిన ప్రకటనలు అవాస్తవాలుగా ఆ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ తేల్చింది. రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్స్‌పై కూడా ఆ వెబ్‌సైట్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది ఆసక్తికరంగా మారింది.