Viral Video: ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చి.. ఇవేం పాడు పనులురా.. ఛీ.. ఛీ మహిళ ముందే..

ఐటీ హబ్ బెంగళూరులో షాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ ఫ్లిక్‌కార్డు డెలివరీ భాయ్.. బలవంతంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించడంతో సదురు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో గటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదురు డెలివరీ భాయ్‌ను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా.. నగరంలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Viral Video: ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చి.. ఇవేం పాడు పనులురా.. ఛీ.. ఛీ మహిళ ముందే..
Marathahalli Delivery Boy Case

Updated on: Jul 12, 2026 | 9:10 PM

ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ ఫ్లిప్‌కార్డు డెలివరీ.. భాయ్ బలవంతంగా మహిళ ఇంట్లోకి చొరబడి.. వాష్‌రూమ్‌ వాడుకుంటానని చెప్పి ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఐటీ హబ్‌ బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ మల్లికార్జున్ కామత్ (22) అనే డెలివరీ బాయ్ శనివారం సాయంత్రం మున్నెకోలాలలోని ఒక అపార్ట్‌మెంట్‌కు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఇక్కడ ఓ మహిళకు ఆర్డర్ అందించిన తర్వాత, ఎమర్జెన్సీ అని బాత్‌రూమ్ వాడుకుంటానని కోరాడు.. అయితే దీనికి ఆమె అనుమతించగా, బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించాడు.

అయితే తన ముందు డెలివరీ భాయ్ ప్రవర్తించిన విధానం చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్‌తో ఆ డెలివరీ భాయ్‌కు సంబందించిన దృశ్యాలను రికార్డు చేసింది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్ మల్లికార్జున్ కామత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై BNS సెక్షన్లు 75, 79, 329(2) కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అటు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం తీవ్రంగా స్పందించింది. తాము ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది. విషయం తెలిసిన వెంటనే సదరు డెలివరీ బాయ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. పోలీసుల దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us