Watch: ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..బహుళ అంతస్తుల భవనంలో మంటలు..

స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.. కాగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Watch: ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..బహుళ అంతస్తుల భవనంలో మంటలు..
Huge Fire In Shoe Factory

Updated on: Sep 15, 2024 | 6:38 PM

ఢిల్లీలోని లారెన్స్ రోడ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల భారీ ఫ్యాక్టరీ పైఅంతస్తు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.. కాగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశాఖ‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది.  సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధమైంది. బోటు ఇంజిన్ లో ఏర్పడిన మంటలు బోటు మొత్తానికి వ్యాపించడంతో ప్ర‌మాదం చోటుచేసుకుందని తెలిసింది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో ఐదుగురు మ‌త్య్స‌కారులు క్షేమంగా బ‌య‌ట‌పడ్డారు. సురమారు రూ. 40 ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని వారు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us