Sanjay Raut ED Raid: చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను.. ఈడీ సోదాలు సమయంలో సంజయ్ రౌత్ ట్వీట్..

శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్..

Sanjay Raut ED Raid: చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను.. ఈడీ సోదాలు సమయంలో సంజయ్ రౌత్ ట్వీట్..
Sanjay Raut Ed Raid
Follow us

|

Updated on: Jul 31, 2022 | 12:20 PM

పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ED ఫోకస్ పెట్టింది.  శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా కొట్టారు. జులై 27న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ అధికారులు ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకున్నారు. పత్రాచాల్‌ భూకుంభకోణం కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలోనే సంజయ్‌ రౌత్‌ ట్విట్ చేశారు.

రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని నిర్వహించినా తాను శివసేనను వీడేది లేదన్నారు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా.. అంటూ పోస్ట్ చేశారు.

బాలాసాహెబ్ ప్రమాణ స్వీకారం చేస్తూ, ఈ స్కాంతో తనకు సంబంధం లేదని సంజయ్ రౌత్ మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. “నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేగా ప్రమాణం చేస్తూ ఈ మాట చెబుతున్నాను. బాలాసాహెబ్ మనకు పోరాడటం నేర్పించారు. నేను శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను” అని రాశారు. దీనికి ఒక రోజు ముందు  తనను అరెస్టు చేసే అనుమానాలు వ్యక్తం చేశారు. నన్ను అరెస్ట్ చేసినా పార్టీ వీడేదిలేదు. కొంతమంది భ్రమల్లో బతుకుతున్నారని, పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

చాల్ ల్యాండ్ స్కామ్ అంటే ఏమిటి?

2007 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆశిష్ కన్‌స్ట్రక్షన్ (ఇది HDIL యొక్క సోదరి సంస్థ) పట్రా చాల్‌ను అభివృద్ధి చేసే పనిని అప్పగించింది. కంపెనీ అక్కడ నివసించే ప్రజలకు 672 ఫ్లాట్లను ఏర్పాటు చేసింది. MHADAకి సుమారు 3000 ఫ్లాట్లను ఇవ్వవలసి ఉంది. ఈ భూమి మొత్తం 47 ఎకరాలు. గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్‌ అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఫ్లాట్‌ను ఎంహెచ్‌ఏడీఏకి ఇవ్వలేదని ఆరోపించారు. ఆ మొత్తం భూమిని, ఎఫ్‌ఎస్‌ఐ 8 బిల్డర్‌ను రూ. 1,034 కోట్లకు విక్రయించింది. ఈ కేసులో సంజయ్ రౌత్‌కు సన్నిహితుడైన ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ కేసులో సంజయ్ రౌత్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం