PM Modi: ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అంశాలపై చర్చ సాగింది. మోదీ, బిల్‌గేట్స్‌ల మీటింగ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ట్రైలర్‌ వీడియోను విడుదల చేశారు. పూర్తి వీడియోను శుక్రవారం రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు ఈ గ్లింప్స్‌ చూస్తే ఇరువురి మధ్య పలు..

PM Modi: ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
Bill Gates, Modi
Follow us

|

Updated on: Mar 28, 2024 | 6:49 PM

ఒకరేమో ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌.. మరొకరకు భారత దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కదూ! తాజాగా ఈ అద్భుత సంఘటనకు ఢిల్లీ వేదికగా మారింది. ఇటీవల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన బిల్‌గేట్స్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య అంశాలపై చర్చ సాగింది. మోదీ, బిల్‌గేట్స్‌ల మీటింగ్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ట్రైలర్‌ వీడియోను విడుదల చేశారు. పూర్తి వీడియోను శుక్రవారం రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు ఈ గ్లింప్స్‌ చూస్తే ఇరువురి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అనుకూలతలో ఆవిష్కరణల వంటి అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం టెక్నాలజీని ప్రజలకు ఎలా చేరువ చేస్తుందన్న విషయాలను బిల్‌గేట్స్‌తో చర్చించారు. వాతావరణ మార్పులతో పాటు కరోనా, వ్యవసాయం, డిజిటల్‌ ఎకానమీ వంటి ఎన్నో అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ వీడియో ఫుల్‌ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచేసింది.

ఇదిలా ఉంటే ఈ నెల మొదటి వారంలో బిల్‌గేట్స్‌ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గేట్స్‌తో భేటీ అయిన విషయాన్ని మోదీ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. గేట్స్‌తో మీటింగ్ అద్భుతంగా సాగిందన్న పీఎం.. పుడమి పరిపరక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించినట్లు ఆ సమయంలో ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..