ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను కంగారు పెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 18 నుంచి 44 సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా వేసేందుకు అనుమతించడంతో.. టీకాపై ప్రజల్లో ఉండే అనుమానాలను తొలగించి అవగాహన పెంచేందుకు కేంద్రం సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిని, తీసుకోని వారిని భయపెట్టే విధంగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గత కొద్ది రోజులుగా ”కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారందరూ రెండేళ్లలో చనిపోతారంటూ” ఓ ఫోటో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. ”టీకాల వల్ల కొత్త వేరియంట్లు పుడతాయని, టీకా తీసుకున్న వాళ్లకు ఎలాంటి చికిత్స ఉండదని ఖచ్చితంగా చనిపోతారని నోబెల్ గ్రహీత లుక్ మాంటగ్రైర్ చెప్పినట్లుగా” ఆ ఫోటో సారాంశం. ఈ వార్తపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్లు సురక్షితమేనని.. రెండేళ్లలో చనిపోతారనేది పూర్తి అవాస్తవమని.. ఇలాంటి వార్తలు ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని సూచించింది. ఈ ఇమేజ్‌ను ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
Also Read:
చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!
మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!
వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!
An image allegedly quoting a French Nobel Laureate on #COVID19 vaccines is circulating on social media
The claim in the image is #FAKE. #COVID19 Vaccine is completely safe
Do not forward this image#PIBFactCheck pic.twitter.com/DMrxY8vdMN
— PIB Fact Check (@PIBFactCheck) May 25, 2021
A misleading quote attributed to a French Nobel Laureate about Vaccines is being shared on Social Media with a false context.
We request citizens to not promote these unverified forwards.
Remember, Misinformation can be as deadly as the virus itself.#ThinkBeforeYouShare pic.twitter.com/jBjColRZOe
— Assam Police (@assampolice) May 25, 2021