India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో

India Coronavirus Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మంగళవారం స్వల్పంగా పెరిగిన కేసుల సంఖ్య.. బుధవారం

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. గత 24 గంటల్లో
Follow us

|

Updated on: Mar 03, 2022 | 10:01 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మంగళవారం స్వల్పంగా పెరిగిన కేసుల సంఖ్య.. బుధవారం స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,561 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. నిన్నటికంటే కేసుల సంఖ్య భారీగా తగ్గింది. వేయి మేర కేసులు తగ్గాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 142 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 77,152 (0.20%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,45,160 కి పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,388 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 14,947 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,53,620 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.62 శాతానికిపైగా ఉంది. వరుసగా 25 రోజుల నుంచి లక్షకు దిగువన కేసుల సంఖ్య నమోదవుతోంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో రికార్డు స్థాయిలో 178.02 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న 21 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరితో కలిపి 178,0263,222 డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

కాగా.. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న 8,82,953 పరీక్షలను చేశారు.

Also Read:

Russia-Ukraine crisis: పుతిన్‌ నిర్ణయం సరైనదే.. ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించిన భారత సంతతి లెజిస్లేచర్..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బంధీలుగా భారతీయ విద్యార్థులు.. రష్యా కీలక ప్రకటన