భారత భూభాగంలో చైనా చొరబాటు.. 423 మీటర్లు !

గాల్వన్ లోయలో చైనా.. భారత భూభాగంలో 423 మీటర్లు చొచ్ఛుకు వచ్చింది.  ఈ ప్రాంతంలో టార్పాలిన్లతో కప్పిన 16 టెంట్లు, పెద్ద షెల్టర్, 14 మిలిటరీ శకటాలను శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. 1960 లో ఇదేచోట..

భారత భూభాగంలో చైనా చొరబాటు.. 423 మీటర్లు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 6:50 PM

గాల్వన్ లోయలో చైనా.. భారత భూభాగంలో 423 మీటర్లు చొచ్ఛుకు వచ్చింది.  ఈ ప్రాంతంలో టార్పాలిన్లతో కప్పిన 16 టెంట్లు, పెద్ద షెల్టర్, 14 మిలిటరీ శకటాలను శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. 1960 లో ఇదేచోట తమ ప్రాంతమని చైనా చెప్పుకున్న స్థలాన్ని దాటి ఇన్ని మీటర్లు ముందుకు వఛ్చినట్టు వెల్లడయింది. నిజానికి సరిహద్దుల్లో నిర్దేశిత ప్రాంతంలో.. ఇది ఉభయదేశాలకు చెందిన భూభాగాలని నాడే (1960 లో ) అప్పటి భారత ప్రభుత్వ అధికారులతో బాటు చైనా అధికారులు కూడా ఓ రిపోర్టులో పేర్కొన్నారు. బోర్డర్లో అప్పుడున్న పరిస్థితిని ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ గాల్వన్ లోయలో ఇప్పటి సిచ్యువేషన్ ని చూస్తే భారత భూభాగంలో 423 మీటర్లు చైనా దళాలు చొచ్ఛుకు వఛ్చినట్టు స్పష్టమవుతోంది. ‘వాళ్ళు గరిష్ట స్థాయిలో పొజిషన్ తీసుకున్నారు’ అని మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు పేర్కొన్నారు. ఆమె హయాంలో సరిహద్దు సమస్యపై భారత, చైనా మధ్య చర్చలు జరిగాయి. నాడు తాము అధికారికంగా జరిపిన చర్చలకన్నా ఇప్పుడు వారు ముందుకు వచ్చారని ఆమె అన్నారు. గాల్వన్ లోయను విస్తృతం చేయడం, నదిపై కల్వర్టులు నిర్మించడం, వందలాది హెవీ ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తరలించడం చూస్తే డ్రాగన్ కంట్రీ పకడ్బందీగా వ్యూహం పన్ని ముందుకు వస్తున్నట్టు భావిస్తున్నారు.