కరోనాకు విరుగుడు మందు..! కనిపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే

|

Mar 03, 2020 | 10:04 AM

వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు సైతం తలమునకలై ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు వైరస్ నివారణకు ‌మందులు కనుక్కునే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు దీనికి ఓ విరుగుడు ఉపాయం చెప్పారు. అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కరోనాకు మందును ప్రకటించారు.

కరోనాకు విరుగుడు మందు..! కనిపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే
Follow us on

యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నమహమ్మారి కరోనా వైరస్..కరోనా దాడితో చైనాలోని వుహాన్ నగరమే దాదాపు స్మశానంగా మారిన పరిస్థితి నెలకొంది. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు సైతం తలమునకలై ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు వైరస్ నివారణకు ‌మందులు కనుక్కునే పనిలో పడ్డారు. ఆ వైరస్ విరుగుడు ఎప్పుడు దొరుకుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు దీనికి ఓ విరుగుడు ఉపాయం చెప్పారు. అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కరోనాకు మందును ప్రకటించారు. ఇంతకీ ఆ మందేంటి..? అది ఎక్కడ దొరుకుతుంది..పూర్తి వివరాలు…

ప్రపంచాన్ని కలవరానికి గురిచేసి గడగడలాడిస్తున్న కొవిడ్‌ -19 భారత్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ కరోనా వైరస్‌కు విరుగుడు మందు ఉందని వెల్లడించారు. గోమూత్రం, గోవు పేడతో కరోనా వైరస్ మహమ్మారి నివారించవచ్చని వ్యాఖ్యానించారు. గో మూత్రం, ఆవు పేడ చల్లిన ప్రాంతం అంతా శుభ్రం అవుతుందని అలానే దీన్ని రాకుండా చేయవచ్చని అన్నారు. దీంతో పాటు గోమూత్రం,పేడ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని కూడా తరిమికొడుతుందని చెప్పారు. ప్రాణాంతకంగా మారిన ఈ మహమ్మారిలను దూరం చేయడానికి ఇదే మంచి పద్దతిగా అభివర్ణించారు.

భారత్‌లో తాజాగా రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధన్. ఢిల్లీతో పాటు హైద‌రాబాద్‌కు చెందిన వ్యక్తుల‌కు కరోనా వైర‌స్‌ సోకిన‌ట్లు తేల్చారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా సోకిన వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది. కరోనా సోకిన ఇద్దరి ట్రావెల్ హిస్టరీని కూడా మంత్రి వెల్లడించారు. ప‌రిస్థితి ముదురుతున్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని దేశాల‌కు ప్రయాణ ఆంక్షల‌ను పెంచిన‌ట్లు హ‌ర్షవ‌ర్ధన్ తెలిపారు. 21 విమానాశ్రయాల్లో, 12 సీపోర్ట్స్‌, 65 మైన‌ర్ సీపోర్ట్‌ల వ‌ద్ద స్క్రీనింగ్ చేప‌డుతున్నార‌ని మంత్రి తెలిపారు.