చెవి నొప్పితో ఆస్పత్రికి.. చివరకు చేయి పోయింది.. అసలేం జరిగిందంటే

చెవిలో నొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కు వెళ్లగా.. అక్కడి డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో ఆమె ఏకంగా చేయి కోల్పొవాల్సి వచ్చింది.

చెవి నొప్పితో ఆస్పత్రికి.. చివరకు చేయి పోయింది.. అసలేం జరిగిందంటే
Women Lost Hand
Follow us

|

Updated on: Sep 02, 2022 | 9:19 AM

డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తాం. ప్రాణాలు నిలిపే వాళ్లు నిజంగా నడిచే దైవాలే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కొందరు వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ.. రోగులు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే బిహార్(Bihar) రాజధాని పాట్నా(Patna)లో వెలుగుచూసింది. చెవిలో నొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కు వెళ్లగా.. అక్కడి డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో ఆమె ఏకంగా చేయి కోల్పొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… శివహర్ డిస్ట్రిక్‌కు చెందిన రేఖ(20)కు విపరీతంగా చెవి నొప్పి వచ్చింది. దీంతో ఆమె పాట్నాలోని మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ హాస్పిటల్‌కు జులై 11న తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ పరిశీలించి అవసరమైన ఆపరేషన్ చేశారు. ఆపై ఓ ఇంజక్షన్ చేశారు. అనంతరం ఇంటికి వెళ్లగా.. రేఖకు ఎడమ చేయి కలర్ ఛేంజ్ అయ్యింది. అంతేకాదు పెయిన్.. వాపు కూడా స్టార్ట్ అయ్యింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. ఏం కాదని చెప్పి పంపేశారు. ఆ తర్వాత చాలా పెయిన్ అలానే కంటిన్యూ అయ్యింది. మెడిసిన్ వాడినా చేయి నొప్పి తగ్గకపోవడంతో.. ఇటీవల పాట్నాలోని మేదాంత హాస్పిటల్‌కు వెళ్లింది. చేతికి ఇన్‌ఫెక్షన్ సోకిందని.. వెంటనే తొలగించాలని డాక్టర్లు చెప్పారు. అలా రేఖ ఎడమచేయి.. మోచేతి వరకు కట్ చేశారు. బాధాకర విషయం ఏంటంటే.. రేఖకు నవంబర్‌లో మ్యారేజ్‌కు ముహూర్తం పెట్టారు. తాజాగా ఆమె చేతిని తొలగించడంతో.. వరుడు పెళ్లికి నో చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..