కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు.. నలుగురు దోషులకు జీవిత ఖైదు!

బీహార్‌లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో మోతిహారి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దారుణ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన కేసుకు సంబంధించి నలుగురు నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ గురువారం (నవంబర్ 26, 2026) తీర్పు ప్రకటించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు.. నలుగురు దోషులకు జీవిత ఖైదు!
Motihari Court

Updated on: Nov 26, 2026 | 10:06 PM

బీహార్‌లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో మోతిహారి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దారుణ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన కేసుకు సంబంధించి నలుగురు నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ గురువారం (నవంబర్ 26, 2026) తీర్పు ప్రకటించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

తూర్పు చంపారన్ జిల్లాలోని హర్సిద్ధి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2023 ఏప్రిల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురవగా, చికిత్స పొందుతూ 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ కేసులో అజయ్ కుమార్ యాదవ్, లలన్ యాదవ్, రాజేశ్ సహానీ, నావల్ కిషోర్ యాదవ్‌లను నిందితులుగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2023 అక్టోబర్ 30న కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున 49 మంది సాక్షులను విచారించారు. నవంబర్ 21న నలుగురినీ దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు.. తాజాగా శిక్షలను ఖరారు చేసింది. కల్తీ మద్యం తయారీ, సరఫరా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారికి ఈ తీర్పు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us