Viral Video: 60 అడుగుల బ్రిడ్జ్‌ని మాయం చేసిన దొంగలు.. ఎలా దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Video: ఏళ్లుగా ఉన్న 60 అడుగుల ఐరన్ బ్రిడ్జి రెండు రోజుల్లో మాయం అయ్యింది. అవును మీరు విన్నది నిజంగా నిజం. కొందరు దొంగలు మాయమాటలు

Viral Video: 60 అడుగుల బ్రిడ్జ్‌ని మాయం చేసిన దొంగలు.. ఎలా దోచుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..!
Bridge

Updated on: Apr 09, 2022 | 4:13 PM

Viral Video: ఏళ్లుగా ఉన్న 60 అడుగుల ఐరన్ బ్రిడ్జి రెండు రోజుల్లో మాయం అయ్యింది. అవును మీరు విన్నది నిజంగా నిజం. కొందరు దొంగలు మాయమాటలు చెప్పి ఈ బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన బిహార్‌లోని రోహ్తాస్ జిల్లా అమియావార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే. అమియావార్‌లో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఉంటుంది. 60 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని మొత్తం ఐరన్‌తో నిర్మించారు. దీని బరువు సుమారు 20 టన్నులు ఉంటుంది. అయితే, ఈ వంతెన వినియోగం లేదు. ఇదే ఛాన్స్‌గా భావించిన దొంగలు.. ఆ ఐరన్ బ్రిడ్జిపై కన్నేశారు. ఆ ఇనుము అంతా కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులం అని స్థానికులకు చెప్పిన ఆ దొంగలు.. ప్రజల సహకారంతో గ్యాస్ కట్టర్లతో ఇనుమును కట్ చేశారు. దాన్ని వాహనంలో లోడ్ చేసి తీసుకెళ్లారు. మూడు రోజుల్లోనే బ్రిడ్జి మొత్తాన్ని మాయం చేశారు.

అయితే, దీని స్థానంలో కొత్త బ్రిడ్జి వేస్తారని స్థానికులు భావించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ తరువాతే అసలు విషయం తెలిసిందే. వచ్చింది అధికారులు కాదు.. అధికారుల ముసుగులో దొంగలు అని తెలుసుకుని అవాక్కయ్యారు స్థానికులు. ఆరా కెనాల్‌పై నిర్మించిన ఈ బ్రిడ్జి పదుల సంఖ్యలో గ్రామాలను కలిపేది. శిథిలావస్థకు చేరిన కారణంగా ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు దర్జాగా బ్రిడ్జిని దోచుకున్నారు. స్థానికుల అమాయకత్వం, అవసరం.. దొంగలకు వరంగా మారింది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దోపిడీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Andhra Pradesh: ఇంట్లో చొరబడిన దొంగలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన యజమాని.. షాకింగ్ వీడియో మీకోసం..!

Andhra Pradesh: పత్తికొండ రాజకీయాలను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Viral News: హెల్పింగ్ క్యాట్.. ఫండ్ రైజింగ్‌లో టాప్.. ఎంత డబ్బు వసూలు చేసిందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!

Follow Us