బిహార్ లో జేడీ-యు కు దెబ్బ, మంత్రి శ్యామ్ రజక్ కి ఉద్వాసన

బిహార్ అసెంబ్లీ ఎన్నికలముందు పాలక జేడీ-యూలో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి శ్యామ్ రజక్ ను పదవి నుంచి తొలగించారు. పార్టీనుంచి బహిష్కరించారు. అయితే....

బిహార్ లో జేడీ-యు కు దెబ్బ, మంత్రి శ్యామ్ రజక్ కి ఉద్వాసన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2020 | 1:46 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికలముందు పాలక జేడీ-యూలో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి శ్యామ్ రజక్ ను పదవి నుంచి తొలగించారు. పార్టీనుంచి బహిష్కరించారు. అయితే తనను పార్టీనుంచి తొలగించలేదని, తన రాజీనామాను స్పీకర్ కి అందజేస్తానని ఆయన సోమవారం చెప్పారు. ఇక నేను లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో చేరుతున్నా అని ప్రకటించారు. సీఎం నితీష్ కుమార్ పట్ల పార్టీలో 99 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రజక్ తెలిపారు. వారి సంగతి నాకు తెలియదు..నేనైతే ఆర్జేడీలో జాయిన్ అవుతున్నా అన్నారాయన.

గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కి సన్నిహితుడైన శ్యామ్ రజక్.. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేడీ-యులో చేరారు. అయితే ఈ పార్టీలో చేరి మంత్రి అయినప్పటికి..తనను ఎవరూ పట్టించుకోవడంలేదని కొంతకాలంగా ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు.  అక్టోబరు-నవంబరు నెలల్లో బిహార్ శాసన సభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో రజాక్ ఎపిసోడ్ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.