కోవిడ్-19..’చేతులు శుభ్రపరచుకోవడం ఎలా ‘? ప్రియాంక గాంధీ ‘షో’

దేశంలో కరోనా నివారణకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలని అంటున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. తరచూ చేతులను  శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా మేరకు చేతుల వాషింగ్ టెక్నీక్ ని తన 60 సెకండ్ల వీడియోలో

కోవిడ్-19..చేతులు శుభ్రపరచుకోవడం ఎలా ? ప్రియాంక గాంధీ షో

Edited By:

Updated on: Mar 22, 2020 | 9:45 AM

దేశంలో కరోనా నివారణకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలని అంటున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. తరచూ చేతులను  శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా మేరకు చేతుల వాషింగ్ టెక్నీక్ ని తన 60 సెకండ్ల వీడియోలో ఆమె చూపారు. ‘ఆందోళన చెందకండి..అందరం కలిసి కరోనాను ఎదుర్కొందాం..మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా ? తేలికయిన ఈ సూత్రాలు పాటిస్తే చాలు..కరోనా మన దరి చేరదు’ అని ప్రియాంక పేర్కొన్నారు.  అన్నట్టు కరోనా పై తప్పుడు ప్రచారం చేయకండి.. సోషల్ మీడియాలో వచ్ఛే వదంతులను నమ్మకండి అని కూడా ఆమె అన్నారు. ఇటీవలే కేరళ పోలీసులు చేతుల శుభ్రతపై తమ వీడియో ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసిన సంగతి విదితమే.

Loading...
Unable to load recommendations.
Follow Us