డ్రాగన్ కంట్రీ కయ్యం .. భారత రేవుల్లో నిలిచిపోయిన చైనా ఉత్పత్తులు

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 10:30 AM

భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు రేగిన  నేపథ్యంలో.. ఆ దేశ ఉత్పత్తులు దేశంలోని వివిధ రేవుల్లో నిలిచిపోయాయి. అమెరికన్ కంపెనీలు ఉత్పత్తి చేసిన యాపిల్, సిస్కో, డెల్ ప్రాడక్టులు కూడా వీటిలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందకపోయినా..

డ్రాగన్ కంట్రీ కయ్యం .. భారత  రేవుల్లో నిలిచిపోయిన చైనా ఉత్పత్తులు
Follow us on

భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు రేగిన  నేపథ్యంలో.. ఆ దేశ ఉత్పత్తులు దేశంలోని వివిధ రేవుల్లో నిలిచిపోయాయి. అమెరికన్ కంపెనీలు ఉత్పత్తి చేసిన యాపిల్, సిస్కో, డెల్ ప్రాడక్టులు కూడా వీటిలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందకపోయినా.. దేశ ప్రధాన రేవుల్లోని కస్టమ్స్ అధికారులు చైనా నుంచి వచ్ఛే కంటెయినర్లను ఆపివేస్తున్నారు. అదనపు క్లియరెన్సులు కావాలని కోరుతున్నారు. అమెరికన్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నయుఎస్-ఇండియా స్ట్రాటిజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్ తాజాగా వాణిజ్యమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ…. విదేశీ ఉత్పత్తుల  దిగుమతుల విషయంలో.. ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల చిక్కులు ఎదురవుతున్నాయని పేర్కొంది. చైనా నుంచి వచ్ఛే ఉత్పత్తులను అధికారులు… విమానాశ్రయాలు, రేవుల్లో నిలిపివేస్తున్నారని తెలిపింది. ఈ ధోరణి విదేశీ ఇన్వెస్టర్లను షాక్ కి గురి చేస్తోందని వెల్లడించింది. ఇక ఈ ఉత్పత్తుల్లో యాపిల్, సిస్కో, డెల్,తో బాటు ఫోర్డ్ మోటార్ కంపెనీ  ప్రాడక్టులు కూడా ఉన్నాయి. తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ ఉత్పత్తి చేసిన ఎలెక్ట్రానిక్ వస్తువులు కూడా వీటిలో ఉన్నాయి. అయితే దేశంలో ఏ రేవుల్లో వీటిని నిలిపివేస్తున్నారో  స్పష్టం కావడంలేదు. కాగా తమ ఆటో పార్టులను చెన్నైలోని ఓ రేవులో నిలిపివేశారని, అధికారులు కోరిన సమాచారాన్ని తాము అందజేశామని ఫోర్డ్ కంపెనీ వెల్లడించింది.