Punjab: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన. సిద్దూతో విభేదాలు తీవ్రం.. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడి.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు ఇప్పట్లో చల్లారే అవకాశాలు కన్పించడం లేదు. సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ , పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య ఆధిపత్య పోరు

Punjab: పంజాబ్ సీఎం సంచలన ప్రకటన. సిద్దూతో విభేదాలు తీవ్రం.. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడి.
Punjab Cm Vs Siddhu
Follow us

|

Updated on: Sep 18, 2021 | 3:20 PM

Amarinder Singh: పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు ఇప్పట్లో చల్లారే అవకాశాలు కన్పించడం లేదు. సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ , పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని, ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇలాఉండగా, పంజాబ్ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సిద్ధూ మరికాసేపట్లో సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించనున్నారనే  అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. సిద్దూకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరీందర్ ససేమిరా అన్నారు. మరి పంజాబ్‌ కాంగ్రెస్‌ పాలిటిక్స్‌ ఏ మలుపు తీసుకుంటాయో వెయిట్‌ చేయాలి.

Read also: TDP Group Politics : సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు..!

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్