ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మోడీకి అరుదైన గౌరవం లభించింది. మోడీ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బూర్జ్ ఖలీఫా టవర్‌పై భారత మువ్వన్నెల జెండాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను ప్రదర్శించారు. ఈ మేరకు ‘గౌరవ అతిథి.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అంటూ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ప్రధాని మోడీ దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో గౌరవ అతిథిగా పాల్గొని ప్రత్యేక కీలకోపన్యాసం చేస్తారు. ఈ సమ్మిట్‌కు ముందే దుబాయ్‌లోని బూర్జ్ ఖలిఫాను అందంగా అలంకరించారు. భారత దేశ జాతీయ పతాకం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోలను ప్రదర్శించి ‘గెస్ట్ ఆఫ్ హానర్-రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అంటూ తమ గౌరవాన్ని చాటుకుంది దుబాయ్.
The world’s tallest building, Burj Khalifa, lights up in Indian flag 🇮🇳 tonight in welcoming Indian PM Modi Ji @narendramodi to the UAE 🇦🇪. Dubai Crown Prince HH Sheikh Hamdan also extends a warm welcome to him and posts on @X. pic.twitter.com/dGMUclxNyr
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) February 13, 2024
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరబ్ లో ఘన స్వాగతం లభించింది. UAEరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ భారత ప్రధానికి ఘనస్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. UAEతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. భారత్- UAE మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. జాయెద్ చొరవ వల్లే అబూధాబిలో హిందూ దేవాలయం రూపుదిద్దుకుందని మోదీ కొనియాడారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. ఈ సందర్భాంగా రెండు దేశాల అధికారులు రెండు దేశాధినేతల సమక్షంలో ఒప్పందాలను మార్చుకున్నారు.
Upon his arrival in Abu Dhabi, PM @narendramodi was warmly received by UAE President, HH @MohamedbinZayed at the airport. pic.twitter.com/U2ONrQU4Tn
— PMO India (@PMOIndia) February 13, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..