Narco Test: నార్కో అనాలసిస్‌ పరీక్ష అంటే ఏమిటి? ఢిల్లీ హత్యోదంతంలో అఫ్తాబ్‌కు దీనిని ఎందుకు చేయాలనుకుంటున్నారు..

|

Nov 17, 2022 | 11:14 AM

నేరస్థులు లేదా నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడానికి పోరెన్సిక్‌ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, సైకాలజిస్టుల పర్యవేక్షణలో నార్కో-అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తారు. మన దేశంలో తొలిసారిగా ఈ పరీక్షను..

1 / 5
నేరస్థులు లేదా నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడానికి పోరెన్సిక్‌ నిపుణులు, దర్యాప్తు అధికారులు, వైద్యులు, సైకాలజిస్టుల పర్యవేక్షణలో నార్కో-అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయంలో కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు సబ్జెక్ట్‌ను పడుకోబెట్టి, కంప్యూటర్‌ స్క్రీన్‌పై విజువల్స్ చూపిస్తారు. మెడికల్‌గా ఫిట్‌గా ఉన్న వ్యక్తికి మాత్రమే హిప్నోటిక్ సోడియం పెంటోథాల్ ఇంజెక్ట్ చేస్తారు. దీనిని థియోపెంటోన్ అని కూడా పిలుస్తారు. దీనిని ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఈ ఇంజక్షన్‌ ఇవ్వగానే వ్యక్తి తన మనసుపై నియంత్రణ (సెల్ఫ్‌ కాన్షియస్‌నెస్‌) కోల్పోతాడు. సెల్ఫ్‌ కాన్షియస్‌నెస్‌ తక్కువగా ఉన్నప్పుడు హిప్నోటిక్ స్థితిలోకి ప్రవేశిస్తాడు. ఎగ్జామినర్లు సబ్జెక్ట్‌ను ప్రశ్నించి, వాస్తవాలను రాబట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

2 / 5
సబ్జెక్టు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్న వ్యక్తికి మాత్రమే హిప్నోటిక్ సోడియం పెంటోథాల్ ఇంజెక్ట్ చేస్తారు. దీనిని థియోపెంటోన్ అని కూడా పిలుస్తారు. వ్యక్తి వయస్సు, జండర్‌, మెడికల్ కండిషన్‌ను బట్టి డోస్‌ ఇస్తారు. డోస్‌ ఎక్కువైతే కొందరు వ్యక్తులు కోమాలోకి వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మన దేశంలో ఈ పరీక్షకు అనుమతి ఉందా? సుప్రీంకోర్టు ప్రకారం.. నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధం. ఐతే కొన్ని క్రిటికల్‌ క్రిమినల్ కేసుల్లో ఈ పద్ధతులను ఉపయోగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నార్కో పరీక్ష సమయంలో సబ్జెక్ట్ మాటలను తప్పనిసరిగా రికార్డ్ చేసి మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి.

3 / 5
వ్యక్తి వయస్సు, జండర్‌, మెడికల్ కండిషన్‌ను బట్టి డోస్‌ ఇస్తారు. డోస్‌ ఎక్కువైతే కొందరు వ్యక్తులు కోమాలోకి వెళ్తుంటారు.  ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మన దేశంలో ఈ పరీక్షకు అనుమతి ఉందా? సుప్రీంకోర్టు ప్రకారం.. నార్కో అనాలిసిస్, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధం. ఐతే కొన్ని క్రిటికల్‌ క్రిమినల్ కేసుల్లో ఈ పద్ధతులను ఉపయోగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నార్కో పరీక్ష సమయంలో సబ్జెక్ట్ మాటలను తప్పనిసరిగా రికార్డ్ చేసి మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి.

4 / 5
నార్కో పరీక్ష 100% ఖచ్చితమైనదా? అంటే..ఈ ప్రశ్నకు సమాధానం కాదని చెప్పాలి. కొందరు వ్యక్తులకు హిప్నోటిక్ సోడియం పెంటోథాల్ ఇంజెక్షన్‌ అంతగా పనిచేయదు. ఇటువంటి సందర్భాల్లో ఆయా వ్యక్తులు స్వీయనియంత్రణ కోల్పోరు. నిజాలకు బదులు.. అబద్ధలు చెప్పే అవకాశం ఉంటుంది.

5 / 5
2002లో గోద్రా మారణహోమం కేసులో నిందితులకు మనదేశంలో తొలిసారిగా నార్కో పరీక్షలు చేశారు. 2003లో తెల్గీ స్టాంప్ పేపర్ స్కాంలో అబ్దుల్ కరీం తెల్గీకి ఈ పరీక్ష చేశారు. 2007 హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో అబ్దుల్ కలీం, ఇమ్రాన్ ఖాన్‌లకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేశారు. 2010లో కుర్లాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడైన మహ్మద్ అజ్మీరీ షేక్ కూడా ఈ పరీక్ష చేశారు. 2012లో లోఖండ్‌వాలాలో ఢిల్లీ వ్యాపారి అరుణ్ టిక్కూ హత్య కేసులో అరెస్టయిన విజయ్ పలాండేకు కూడా నార్కో పరీక్ష చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వికాస్‌ వాకర్‌ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్‌కు కూడా నార్కో పరీక్షలు నిర్వహించనున్నారు. తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన అఫ్తాబ్‌ అమీన్‌ పునావాలా(28) నుంచి కీలక ఆధారాలు రాబెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.