Balakot Airstrike: బాలాకోట్‌ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. సంచలన విషయాలు వెల్లడించిన పాక్‌ మాజీ దౌత్యవేత్త

Balakot Airstrike: బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ...

Balakot Airstrike: బాలాకోట్‌ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. సంచలన విషయాలు వెల్లడించిన పాక్‌ మాజీ దౌత్యవేత్త
Follow us

|

Updated on: Jan 10, 2021 | 5:58 AM

Balakot Airstrike: బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వెల్లడించారు. టీవీ చర్చల్లో పాక్‌ సైన్యం తరపున మాట్లాడిన ఆయన.. శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత సైన్యం జరిపిన దాడుల్లో తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అప్పట్లో పాకిస్థాన్‌ ప్రగల్బాలు పలికింది.

ఈ నేపథ్యంలో భారత్‌ చేపట్టిన యుద్ధ చర్యలో పాక్‌లో కనీసం 300 మంది మృతి చెందినట్లు హిలాలీ ఓ ఉర్దూ ఛానెల్‌తో పేర్కొనడంతో పాకిస్థాన్‌ అబద్దపు మాటలు బట్టబయలయ్యాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. దీనికి ప్రతీకారంగా రంగంలోకి దిగిన భారత సైన్యం బాలాకోట్‌లోని ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.

ఇండోర్‌లో పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. హైదరాబాద్ మూలాలపై నిఘా వర్గాల ఆరా..!