Viral: అమ్మబాబోయ్.. ఎంత పే..ద్ద పామో.. కింగ్ కోబ్రా వీడియో చూస్తే జడుసుకోవాల్సిందే..

సాధారణంగా మనం పామును చూస్తే భయపడి పారిపోతాం.. అలాంటిది 10 అడుగుల పాము.. అది కూడా కింగ్ కోబ్రా దగ్గరా ఉండి.. బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైన గమనించారా..? వామ్మో.. అలాంటి పాము గురించి తలచుకుంటేనే ముచ్చెమటలు పడతాయి..

Viral: అమ్మబాబోయ్.. ఎంత పే..ద్ద పామో.. కింగ్ కోబ్రా వీడియో చూస్తే జడుసుకోవాల్సిందే..
King Cobra

Updated on: Oct 05, 2025 | 4:46 PM

సాధారణంగా మనం పామును చూస్తే భయపడి పారిపోతాం.. అలాంటిది 10 అడుగుల పాము.. అది కూడా కింగ్ కోబ్రా దగ్గరా ఉండి.. బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైన గమనించారా..? వామ్మో.. దీని గురించి తలచుకుంటేనే ముచ్చెమటలు పడతాయి.. ఇక అక్కడి పరిస్థితి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గోశాల నుంచి 10 అడుగుల భారీ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసిన ఒడిశాలోని గంజాం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలోని బాదాపూర్ పంచాయతీ పరిధిలోని బలిపదర్ గ్రామంలోని ఒక గోశాల నుండి ఈ భారీ విషపూరిత భారీ కింగ్ కోబ్రాను రక్షించారు.

బలిపదర్ కు చెందిన దేవ్ నాయక్ అనే వ్యక్తి గోశాలలోకి ఒక పెద్ద పాము ప్రవేశించి.. బుసలు కొట్టింది.. అయితే.. గోశాలలో భారీ పామును చూసిన నిర్వహకుడు దేవ్ దానిని రెస్క్యూ చేసేందుకు స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులకు ఫోన్ చేశాడు.

సమాచారం అందగానే.. స్నేక్ హెల్ప్ లైన్ సభ్యులు రామ్ చంద్ర సాహు, జగన్నాథ్ సాహు గ్రామాన్ని సందర్శించి సంఘటనా స్థలానికి వెళ్లారు. వారు గోశాల లోపల సంచరిస్తున్న భారీ కింగ్ కోబ్రాను చూసి.. వారు అప్రమత్తమయ్యారు.. అనంతరం అతి కష్టం మీద.. స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు ఆ పామును గోశాల నుండి జాగ్రత్తగా రక్షించి బయటకు తీసుకువచ్చారు.

వీడియోను ఇక్కడ చూడండి:

ఆ తర్వాత భారీ కింగ్ కోబ్రాను ఒక సంచిలో బంధించి.. గ్రామానికి దూరంగా ఉన్న అడవిలో వదిలేశారు. భారీ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..