చిరు బయోపిక్‌పై నాగబాబు స్పందన

టాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు నడుస్తోంది. సావిత్రి జీవితకథతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి ఘన విజయం సాధించడంతో బయోపిక్‌లు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ను తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా చిరంజీవి బయోపిక్ తీస్తే బావుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో చిరు బయోపిక్ అంశం హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చిరంజీవి జీవితంలో మలుపులేవి లేవని.. ఆయన కథతో బయోపిక్‌ తెరకెక్కించాల్సిన […]

  • Manju Sandulo
  • Publish Date - 3:58 pm, Sat, 16 February 19

టాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు నడుస్తోంది. సావిత్రి జీవితకథతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి ఘన విజయం సాధించడంతో బయోపిక్‌లు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ను తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా చిరంజీవి బయోపిక్ తీస్తే బావుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో చిరు బయోపిక్ అంశం హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

చిరంజీవి జీవితంలో మలుపులేవి లేవని.. ఆయన కథతో బయోపిక్‌ తెరకెక్కించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. అయితే నాగబాబు చెప్పినా చెప్పకపోయినా.. చిరు జీవితంలో చాలా మలుపులే ఉన్నాయి. ఓ సాధారణ నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు.. తనదైన నటన, డ్యాన్స్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు నంబర్.1 స్థానంలో ఉంటూ మెగాస్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, మళ్లీ దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడం చేశారు. ఇలాంటి మలుపులు చిరు జీవితంలో ఉన్నాయి కాబట్టే అతడి బయోపిక్ తీస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి చిరు బయోపిక్ అవసరం లేదన్న నాగబాబు మాటలను వారు ఎలా తీసుకుంటారో చూడాలి.