ముంబై నీళ్లు పరిశుద్ధం,, మరి.. ట్రాఫిక్ అధ్వాన్నం

ముంబై నగరం రెండు రకాలుగా.. ఇటు మంచి.. అటు అధ్వాన్నంగా ‘ పాపులర్ ‘ అయింది. ఈ నగరం నీళ్లు పరిశుధ్ధమైనవేనని, ఇక్కడి ప్రజలు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫయర్స్ కొనాల్సిన అవసరమే లేదని తేలింది. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పరీక్షలో తేలిన నిజమిది.. నగరంలోని వివిధ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిల నుంచి సేకరించిన సాంపిల్స్ ఆధారంగా ఈ స్టడీ నిర్వహించారు. అయితే ఢిల్లీ, కోల్ కత, చెన్నై […]

ముంబై నీళ్లు పరిశుద్ధం,, మరి.. ట్రాఫిక్ అధ్వాన్నం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2019 | 3:57 PM

ముంబై నగరం రెండు రకాలుగా.. ఇటు మంచి.. అటు అధ్వాన్నంగా ‘ పాపులర్ ‘ అయింది. ఈ నగరం నీళ్లు పరిశుధ్ధమైనవేనని, ఇక్కడి ప్రజలు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫయర్స్ కొనాల్సిన అవసరమే లేదని తేలింది. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పరీక్షలో తేలిన నిజమిది.. నగరంలోని వివిధ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిల నుంచి సేకరించిన సాంపిల్స్ ఆధారంగా ఈ స్టడీ నిర్వహించారు. అయితే ఢిల్లీ, కోల్ కత, చెన్నై నగరాలు మాత్రం ఈ విషయంలో విఫలమయ్యాయి. 11 క్వాలిటీ పారా మీటర్లకు గాను పదింటిలో ఇవి ఫెయిలయినట్టు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. మొత్తం 20 రాష్ట్ర రాజధానుల నుంచి తాము మంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు. హైదరాబాద్, భువనేశ్వర్, రాంచీ, రాయపూర్, అమరావతి, సిమ్లాల నుంచి కలెక్ట్ చేసిన నీటి నమూనాలు సంతృప్తికరంగా లేవని ఆయన చెప్పారు.

ఇక ట్రాఫిక్ విషయానికే వస్తే.. ముంబై నగర పరిస్థితి ఘోరంగా ఉంది. రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు అతి దారుణంగా ఉన్నాయని, దీంతో ట్రాఫిక్ జామ్ అన్నది సర్వ సాధారణమైపోయిందని.. ఒక విధంగా చెప్పాలంటే డ్రైవింగ్ కి ప్రపంచంలోనే ఈ సిటీ అధ్వాన్నంగా ఉందని ‘ యూరోపియన్ పార్ట్స్ రిటైలర్ ‘ మిస్టర్ ఆటో ‘ తన అధ్యయనంలో వెల్లడించింది. పాకిస్తాన్ లోని కరాచీ నగరంకన్నా ఈ నగరం ‘ చెత్త ‘ గా ఉందంటే అతిశయోక్తి కాదని ఈ స్టడీ అభిప్రాయపడింది. ఇక కోల్‌కతా మూడో స్థానంలో ఉందట. అయితే కెనడాలోని కేల్గరీ, ఆ తరువాత దుబాయ్ బెస్ట్ సిటీస్‌గా మొదటి, రెండో స్థానాలు ఆక్రమించాయి.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..