మీ టూ ఉద్యమానికి కారణం మహిళలేనట!

బీఆర్‌ చోప్రా సీరియల్‌ మహాభారత్‌లో భీష్ముడి పాత్ర పోషించిన ముఖేష్‌ ఖన్నా గుర్తుండే ఉంటాడు.. ఆ తర్వాత శక్తిమాన్‌ అనే సీరియల్‌లో కూడా నటించాడు.. ఈయనకు నోటి దురుసు ఎక్కువే! ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతుంటాడు.. తన చేసేవి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకుంటాడు. కానీ అవి ఇతరులను హర్ట్‌ చేసేట్టుగా ఉంటాయి.. ఇప్పుడు మీ టూ ఉద్యమంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు ముఖేష్‌ కన్నా.. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మీ టూ ఉద్యమం […]

మీ టూ ఉద్యమానికి కారణం మహిళలేనట!
Follow us

|

Updated on: Oct 31, 2020 | 3:45 PM

బీఆర్‌ చోప్రా సీరియల్‌ మహాభారత్‌లో భీష్ముడి పాత్ర పోషించిన ముఖేష్‌ ఖన్నా గుర్తుండే ఉంటాడు.. ఆ తర్వాత శక్తిమాన్‌ అనే సీరియల్‌లో కూడా నటించాడు.. ఈయనకు నోటి దురుసు ఎక్కువే! ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతుంటాడు.. తన చేసేవి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకుంటాడు. కానీ అవి ఇతరులను హర్ట్‌ చేసేట్టుగా ఉంటాయి.. ఇప్పుడు మీ టూ ఉద్యమంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు ముఖేష్‌ కన్నా.. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మీ టూ ఉద్యమం గురించి పరమచెత్తగా మాట్లాడారు. మీ టూ ఉద్యమానికి మహిళలే బాధ్యులంటూ కొత్త భాష్యం చెప్పాడు ఈ సీరియల్ భీష్ముడు. మహిళలు ఇంటిపనికైతే బాగా సరిపోతారట.. అలా ఇంటి పనులు చేసుకోకుండా గడపదాటి బయటకు వచ్చి పురుషులతో పోటీపడటం మొదలు పెట్టారట! దానివల్లే మీ టూ ఉద్యమం మొదలయ్యిందట! ఇందుకు బాధ్యత వహించవలసింది కూడా మహిళలేనట! ఆయన మాటల్లో ఏమైనా లాజిక్కు ఉందా? ఆయన చెప్పిదంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.. ఇన్నేసి మాటలన్నాక మహిళలు గమ్మునుంటారా? ముఖేష్ ఖన్నాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.