నా స్టంపౌట్ల సీక్రెట్ అదే..నిక్ నేమ్ ‘తలా’ వెరీ స్పెషల్‌- ధోని

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తన స్టంపింగ్‌ సీక్రెట్‌ను చెప్పేశాడు. వికెట్ల వెనుక రెప్పపాటులో, ఉహించని స్టంపింగ్స్ చేసిన ఘనత ధోనికి ఉంది. అలాగే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒకే ఓవర్‌లో రెండు స్టంపౌట్లు చేసి ధోని మ్యాజిక్ ఏంటే మళ్లీ రుచి రూపించాడు. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ వల్లే నేను వేగంగా స్టంపౌట్లు చెయ్యగలుగుతున్నా.  అందులోని బేసిక్స్‌ కచ్చితంగా నేర్చుకొని అత్యుత్తమంగా ఎదగాలి. […]

నా స్టంపౌట్ల సీక్రెట్ అదే..నిక్ నేమ్ 'తలా' వెరీ స్పెషల్‌- ధోని
Follow us

|

Updated on: May 03, 2019 | 6:18 AM

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తన స్టంపింగ్‌ సీక్రెట్‌ను చెప్పేశాడు. వికెట్ల వెనుక రెప్పపాటులో, ఉహించని స్టంపింగ్స్ చేసిన ఘనత ధోనికి ఉంది. అలాగే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒకే ఓవర్‌లో రెండు స్టంపౌట్లు చేసి ధోని మ్యాజిక్ ఏంటే మళ్లీ రుచి రూపించాడు. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ వల్లే నేను వేగంగా స్టంపౌట్లు చెయ్యగలుగుతున్నా.  అందులోని బేసిక్స్‌ కచ్చితంగా నేర్చుకొని అత్యుత్తమంగా ఎదగాలి. అందుకు ప్రాథమిక నైపుణ్యాలు చాలా అవసరం’ అని చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో ధోనీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకున్న ‘తలా’ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఆడి తన సత్తా చాటాడు. కేవలం 22 బంతుల్లో 44 పరుగులు చేసి చెన్నై జట్టులో తనెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. ఇక ఫ్యాన్స్‌ ధోనీని ముద్దుగా మిస్టర్ కూల్‌ అని పిలుచుకుంటారు. అలాగే మహీ, ఎమ్‌ఎస్‌డీ, జార్ఖండ్ డైనమైట్ అని కూడా ప్రేమగా పిలుచుకుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రాణిస్తున్న ధోనికి  మరో ముద్దుపేరు(నిక్‌ నేమ్‌) కూడా వచ్చి చేరింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ అతన్ని ముద్దుగా ‘తలా’ అంటూ పిలుచుకుంటున్నారు. తమిళ్‌లో తాలా అంటే లీడర్‌ అని అర్థం. కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కాబట్టి ధోనిని తలా పిలుచుకుంటున్నారు. అయితే తనకు ఫ్యాన్స్‌ పెట్టుకున్న ముద్దు పేర్లలలో ‘తలా’  చాలా స్పెషల్‌ అంటు మురిసిపోతున్నాడు ధోని

Latest Articles